- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
RTC ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన సజ్జనార్.. బస్ టికెట్ ధర తగ్గింపు
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విట్టర్ వేదికగా ప్రయాణీకులకు శుభవార్త అందించారు. బస్ టికెట్ ధరను 20 శాతం తగ్గిస్తున్నట్టు పేర్కొన్నారు. వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లో డిసెంబర్ 18వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఎన్టీఆర్ స్టేడియంలో 34వ బుక్ ఫేయిర్ జరుగనుంది.
ఈ నేపథ్యంలో బుక్ ఫేయిర్ సందర్శించే వారి కోసం ఈనెల 18వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ట్రావెల్ యూస్ యు లైక్ T24 టికెట్ ధరపై 20 శాతం తగ్గింపును ఇస్తున్నట్టు ఆర్టీసీ యాజమాన్యం ఓ ప్రకటనలో తెలిపింది. దీంతో వంద రూపాయలు ఉన్న ఈ టికెట్ల ధరలు 80 రూపాయలకు చేరుకోనుంది. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని సజ్జనార్ పేర్కొన్నారు. ఈ టికెట్లు పుస్తక ప్రదర్శన కేంద్రం వద్ద లభిస్తాయని ఆయన చెప్పారు.
పుస్తక ప్రియులకు శుభవార్త, 34 #HyderabadBookFair సందర్భంగా, డిసెంబర్ 18 నుండి 27వ తేదీ వరకు NTR గార్డెన్స్లో బుక్ ఫెయిర్ను సందర్శించే వారి T24 టిక్కెట్లపై #TSRTC 20% తగ్గింపును అందిస్తోంది. #Hyderabad #sundayvibes #IchooseTSRTC @TV9Telugu @sakshinews @eenadulivenews pic.twitter.com/9rOC3kOGDY
— V.C Sajjanar IPS MD TSRTC Office (@tsrtcmdoffice) December 19, 2021