నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..

by srinivas |
APPSC
X

దిశ, ఏపీ బ్యూరో: నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తీపి కబురు చెప్పింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,180 ఖాళీలు గుర్తించినట్లు తెలిపింది. వీటిలో గ్రూప్1, గ్రూప్ 2 పోస్టులు ఉన్నట్లు స్పష్టం చేసింది. పోస్టులు పెంచి ఆగష్టులో నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలిపింది. రాబోయే మూడు లేదా నాలుగు నెలల్లో నియామక ప్రక్రియ చేపట్టబోతున్నట్లు వెల్లడించింది. ఇకపై గ్రూప్ 1మినహా ఏపీపీఎస్సీ నిర్వహించే అన్ని పరీక్షలకు ప్రిలిమ్స్ రద్దు చేస్తున్నట్లు ఏపీపీఎస్సీ సభ్యులు సలాం బాబు స్పష్టం చేశారు. ప్రిలిమ్స్ పరీక్ష రద్దుకు సంబంధించి జీవోలు 39, 150 లను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు.

ఇకపోతే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఈ పోస్టులకు వర్తింపజేస్తామని తెలిపింది. అగ్రవర్ణ పేదలకిచ్చే రిజర్వేషన్లపై రోస్టర్ పాయింట్లను ప్రభుత్వం ఖరారు చేయాల్సి ఉందన్నారు. గ్రూప్ 1 రిక్రూట్‌మెంట్‌లో ఇంటర్వ్యూ విధానం రద్దు చేస్తూ ఇటీవలే ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అన్ని కేటగిరిల్లోనూ ఇంటర్వ్యూలు రద్దు చేస్తూ ఉత్తర్వులు సైతం విడుదల చేసింది. గ్రూప్ పరీక్షల్లో సంపూర్ణ పారదర్శకత కోసం ఇంటర్వ్యూ విధానాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

Advertisement

Next Story

Most Viewed