- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బాన్సువాడకు గుడ్‌న్యూస్.. కీలక ప్రకటన చేసిన సభాపతి పోచారం…
దిశ ప్రతినిధి, నిజామాబాద్: బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధికి 100 కోట్ల రూపాయల నిధులు మంజూరైనట్లు సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. మంగళవారం బీర్కూర్ శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానాన్ని దర్శించుకొని శ్రీవారికి మొక్కులు తీర్చుకున్నారు పోచారం శ్రీనివాస్ రెడ్డి. అనంతరం గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కేటాయించిన 13 కోట్ల రూపాయల నిధులతో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేయాలి అంటూ, ఆయన ఆదేశించారు. క్షుణ్ణంగా అభివృద్ధి పనులను రెండు గంటల పాటు ఆలయ పరిసరాల్లో తిరుగుతూ పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ… నియోజకవర్గ అభివృద్ధికి వంద కోట్ల రూపాయలు మంజూరు కాగా, ఆయా మండలాల్లో అభివృద్ధి కోసం నిధులు కేటాయించడం జరుగుతుందని సభాపతి పోచారం వెల్లడించారు.
ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మరో అదనంగా పది కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడం పట్ల, ముఖ్యమంత్రికి పోచారం కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిధులతో రహదారులు అభివృద్ధి చేయడం జరుగుతుందని సభాపతి వెల్లడించారు. ఈ నిధులతో గ్రామాలలో పెండింగ్లో ఉన్న మురికి కాలువలు, రహదారులు నిర్మాణాలు చేపట్ట వచ్చునని పోచారం వివరించారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని, స్థానిక ప్రజా ప్రతినిధులు ఎప్పటికప్పుడు పనులపై పర్యవేక్షణ జరిపి నిధులు దుర్వినియోగం కాకుండా చూడాల్సిన బాధ్యత ఉందంటూ సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ వెంట డీసీసీ అధ్యక్షులు పోచారం భాస్కర్ రెడ్డి, ఆలయ ధర్మకర్త శంభు రెడ్డి, బీర్కుర్ఎంపీపీ రఘు వివిధ గ్రామాల నుంచి వచ్చిన సర్పంచులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు..