- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్ న్యూస్.. నగదు జమ చేసిన సీఎం జగన్
దిశ, ఏపీ బ్యూరో: ‘అగ్రిగోల్డ్ బాధితులకు అండగా ఉంటామని ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నాం. దీనిలో భాగంగా డిపాజిట్ దారులైన 10లక్షల 45వేల కుటుంబాలకు రూ.905.57 కోట్లు చెల్లించాం. రెండో దశ కింద రూ.20వేల లోపు 7 లక్షల మంది డిపాజిటర్ల ఖాతాల్లో రూ.666.84 కోట్ల నగదు జమ చేశాం. ప్రైవేట్ సంస్థ బాధితులకు న్యాయం చేసిన దాఖలాలు దేశంలో ఎక్కడా లేదు కానీ పేద ప్రజల కోసం ప్రభుత్వం బాధ్యతగా తీసుకుందని’ సీఎం వైఎస్ జగన్ అన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం అగ్రిగోల్డ్ బాధితులకు నగదు జమ చేశారు. రూ.20వేల లోపు డిపాజిట్ దారుల ఖాతాలో నగదు జమ చేశారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ “గత ప్రభుత్వంలో ఉన్న మనుషుల కోసమే అగ్రిగోల్డ్ స్కామ్ జరిగిందని..గత ప్రభుత్వం అగ్రిగోల్డ్ యాజమాన్యంతో కుమ్మక్కైందని ఆరోపించారు. 2019 నవంబర్‌లోనే 3.40 లక్షల మందికి రూ.238.73 కోట్లు చెల్లించామని” సీఎం జగన్ తెలిపారు. తాజాగా నేడు రూ.20వేల లోపు డిపాజిటర్ల ఖాతాల్లో రూ.666.84 కోట్లు చెల్లించినట్లు తెలిపారు. మెుత్తం 10లక్షల 45వేల కుటుంబాలకు రూ.905.57 కోట్లు జమ చేసినట్లు సీఎం వెల్లడించారు. అగ్రిగోల్డ్ వ్యవహారం కొలిక్కి రాగానే మిగిలిన డిపాజిటర్లకు చెల్లింపులు ఉంటాయని హామీ ఇచ్చారు.
అగ్రిగోల్డ్ బాధితులకు జగన్ అండ- హోంమంత్రి సుచరిత
ప్రైవేట్ సంస్థ మోసం చేస్తే బాధితులను ప్రభుత్వాలు ఆదుకున్న పరిస్థితులు దేశంలో ఏ రాష్ట్రంలోనూ జరగలేదని కానీ తొలిసారిగా సీఎం జగన్ అగ్రిగోల్డ్ సంస్థ చేతిలో మోసపోయిన లబ్ధిదారులకు అండగా నిలిచారని చెప్పుకొచ్చారు. అగ్రిగోల్డ్ సంస్థ మోసాల వల్ల 300 మంది బాధితులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు సీఎం జగన్ అండగా నిలిచారని కొనియాడారు. రూ.20వేల లోపు డిపాజిటర్ల ఖాతాల్లో రూ.666.84 కోట్ల నగదు జమ చేస్తున్నారని, ఇప్పటికే రూ.10వేలలోపు డిపాజిటర్లకు రూ.238.73 కోట్లు చెల్లించినట్లు వెల్లడించారు. ఇతర రాష్ట్రాల్లో బాధితులను ప్రభుత్వాలు ఆదుకోవడం లేదని గుర్తు చేశారు. రూ.10 వేల నుంచి రూ.20వేల లోపు 7 లక్షల మంది డిపాజిట్‌దారులకు రూ.666.84 కోట్లను నేడు బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు హోంమంత్రి సుచరిత తెలిపారు.