- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రమాదకరస్థాయిలో గోదావరి ప్రవాహం
దిశ ప్రతినిధి, ఖమ్మం: గోదావరి నది ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తోంది. సోమవారం ఉదయం 7 గంటల సమయానికి భద్రాచలం వద్ద 17 లక్షల 23 క్యూసెక్కుల వేగంతో 58.60 అడుగుల నీటిమట్టంతో ప్రవహిస్తోంది. ప్రవాహం ఉధృతి గంటగంటకు పెరుగుతుండటంతో భద్రాద్రి జిల్లా యంత్రాంగం అప్రమత్తమయ్యారు. ఇప్పటికే కలెక్టర్ ఎంవీరెడ్డి అధికారులతో అక్కడే మకాం వేశారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
మంత్రి అజయ్‌కుమార్ ఆదివారం సాయంత్రం గోదావరి ఉధృతిని స్వయంగా పరిశీలించారు. వరద అనుహ్యంగా పెరిగితే తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను ఇప్పటికే ఖాళీ చేయించారు. ప్రస్తుతం 60అడుగుల వరకు ప్రవాహం పెరిగిన ఇబ్బదేమీ ఉండదని అధికారులు పేర్కొంటున్నారు. గోదావరి ప్రవాహం పెరుగుతుండటంతో స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు.