- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యజమానికి పడే శిక్ష.. అతని మేకకు పడింది!
దిశ, వెబ్ డెస్క్ : యజమాని చేసిన తప్పు వలన అతనికి చెందిన మేకను పోలీసులు అరెస్టు చేశారు. కారణం యజమాని మాస్క్ పెట్టుకోకపోవడమే.. ఈ వింత ఘటన యూపీలోని కాన్పూర్ బెకన్‌గంజ్‌లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఓ వ్యక్తి మాస్క్ లేకుండా రోడ్డుపై అటుఇటు తిరుగుతూ ఉండటంతో పోలీసులు అతన్ని ప్రశ్నించారు. భయాందోళనకు గురైన అతను అక్కడి నుంచి పారిపోయాడు. కాగా, అతనికి చెందిన మేకను కంగారులో అక్కడే వదిలేసి వెళ్లాడు. దీంతో పోలీసులు ఆ మేకను స్టేషన్‌కు తరలించారు.
యజమాని కాసేపు అయ్యాక వచ్చి చూస్తే.. అక్కడ మేక కనిపించ లేదు. స్థానికులను ఆరా తీయగా.. పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారని చెప్పడంతో యజమాని షాక్ తిన్నాడు. వెంటనే స్టేషన్‌కి వెళ్లి.. ఇంకెప్పుడూ నిబంధనలు అతిక్రమించనని చెప్పడంతో కనికరించిన పోలీసులు మేకను విడిచిపెట్టారు. మాస్క్ లేకుండా ఇంకెప్పుడూ బయట కనిపించకూడదని పోలీసులు హెచ్చరించారు.
ఈ విషయం ఆ నోటా ఈ నోటా పాకి.. సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. మేకను ఎవరైనా అరెస్ట్ చేస్తారా? అని పోలీసులను నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. పోలీసులు మాత్రం తాము చేసిన చర్యలను సమర్థించుకుంటున్నారు. కుక్కలే మాస్కులు ధరించినప్పుడు.. మేకలు ఎందుకు మాస్క్ ధరించకూడదని బెకన్‌గంజ్ పోలీసులు రివర్స్ కౌంటర్ ఇస్తున్నారు.