- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
విమాన ప్రయాణంపై జీఎంఆర్ గ్రూప్ వెబినార్
దిశ, న్యూస్‌బ్యూరో: ‘‘విమాన ప్రయాణంపై విశ్వాసాన్ని తిరిగి నెలకొల్పడం’’ పేరిట జీఎంఆర్ గ్రూపు మంగళవారం వెబినార్ నిర్వహిస్తోంది. పౌర విమానయానం, హౌజింగ్ అండ్ అర్బన్ అఫైర్స్, కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ శాఖలు నిర్వహిస్తున్న వెబినార్‌లో కేంద్రమంత్రి హర్దీప్‌సింగ్‌పురి, ఏఐఐఎంఎస్ డైరెక్టర్ రణదీప్ గులేరియా ప్రసంగిస్తారు. కేంద్రమంత్రి తన ప్రసంగంలో ప్రభుత్వ దృక్పథాన్ని తెలియజేయనుండగా డాక్టర్ గులేరియా విమాన ప్రయాణాల్లో ఆరోగ్య సంరక్షణపై సందేహాలను తీరుస్తారు. వెబినార్ ప్యానెల్‌లో స్పైస్ జెట్ ఛైర్మన్ అండ్ ఎండీ అజయ్ సింగ్, డీఐఏఎల్ సీఈవో విదేహ్ కుమార్ జైపురియార్ పాల్గొంటారు. ‘ఫ్లయింగ్ ఈజ్ సేఫ్ అండ్ సెక్యూర్’ అన్న అంశంపై సింగ్,‘అవర్ ఎయిర్ పోర్ట్స్ – రెడీ అండ్ సేఫ్’పై జైపురియార్ ప్రసంగిస్తారు. వక్తలు వెబినార్‌లో పాల్గొనే వారి ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారు. ఎయిర్ ప్యాసింజర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు శ్రీ డి. సుధాకర్ రెడ్డి ఈ వెబినార్ సమన్వయకర్తగా వ్యవహరిస్తారు. ఈ వెబినార్ లో- పాలసీ డైనమిక్స్, మే 25న విమాన సర్వీసులు ప్రారంభమైన నాటి నుంచి ఎధుర్కొంటున్న సవాళ్లు, ప్రయాణికుల్లో తిరిగి విశ్వాసాన్ని నెలకొల్పడానికి తీసుకుంటున్న చర్యలపై వివరిస్తారు. ఒక కొత్త వాతావరణంతో కలిసి జీవించడానికి ప్రయత్నిస్తున్నాం, కొత్త నియమాలు, కొత్త అలవాట్లతో పాటు ప్రజల్లో విశ్వాసాన్ని కూడా పెంచాల్సిన అవసరం ఉంది. ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభమై, ప్రపంచం ముందుకు పోతున్న టైంలో ప్రగతి కోసం ఈ విశ్వాసం ప్రోత్సాహకంగా పని చేస్తుంది. ఈ వెబినార్‌తో ప్రయాణికుల్లో ఉన్న అయోమయాన్ని తొలగించి సరైన సమాచారాన్ని అందివ్వాలనుకుంటున్నాం అని జీఎంఆర్ సంస్థ తెలిపింది.