బాయ్‌ఫ్రెండ్ ఉంటేనే కాలేజీకి రావాలి.. సర్క్యులర్ జారీ !

by Shamantha N |
బాయ్‌ఫ్రెండ్ ఉంటేనే కాలేజీకి రావాలి.. సర్క్యులర్ జారీ !
X

దిశ, వెబ్‌డెస్క్: ‘అమ్మాయిలకు ఖచ్చితంగా బాయ్‌ఫ్రెండ్ ఉండాల్సిందే ! లేకుంటే కాలేజీలో అడుగు పెట్టడానికి వీల్లేదు. ప్రేమికుల రోజు వరకు ఛాయిస్‌. అప్పటివరకు బాయ్‌ఫ్రెండ్‌ లేకుంటే అంతే సంగతులు. ఇదేకాదు.. బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడని నిరూపించుకునేందుకు కలిసి దిగిన ఫోటోలను సైతం చూపించాలి’ అని.. ఓ కాలేజీ పేరిట ప్రజెంట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. యూపీలోని ఆగ్రాలో గల సెయింట్ జాన్స్‌ కాలేజీ పేరిట సర్క్యులర్ ఉంది. జనవరి 14న ప్రొ. అశిశ్ శర్మ సైన్‌తో జారీ అయినట్లు కనపడుతోంది. అంతేకాదు అందులో వీలైతే ప్రేమను పంచండి అంటూ ఓ చిన్న సలహాను కూడా ఇచ్చేశారు.

సోషల్ మీడియాలో ఈ విషయాన్ని గమనించిన విద్యార్థుల తల్లిదండ్రులు కాలేజీ వద్దకు వెళ్లి ఆరా తీశారు. స్పందించిన ప్రిన్సిపాల్ ప్రొ.ఎస్పీ సింగ్ మాట్లాడుతూ కాలేజీ పరువు తీసేందుకే కొంతమంది ఇలా చేసి ఉంటారని అభిప్రాయపడ్డారు. అసలు మా కాలేజీలో అశిశ్ శర్మ అనే ప్రొఫెసర్ లేరని చెప్పుకొచ్చారు. మొదటగా ఇదంతా విద్యార్థుల వాట్సప్ గ్రూపుల్లో తిరిగి.. ఆ తర్వాత బయటకు వచ్చేసిందని సమాచారం. సీనియర్ విద్యార్థులే అమ్మాయిలను ఆట పట్టించేందుకు ఇలా చేసి ఉంటారని అనుమానిస్తున్నారు.

https://twitter.com/ASP_009/status/1354302541803085825?s=20

Advertisement

Next Story