ఇంటర్ ఫలితాల ఎఫెక్ట్.. రైలు కిందపడి బాలిక ఆత్మహత్య

by Sumithra |   ( Updated:2021-12-17 00:15:37.0  )
ఇంటర్ ఫలితాల ఎఫెక్ట్.. రైలు కిందపడి బాలిక ఆత్మహత్య
X

దిశ, వెబ్‌డెస్క్ : ఇంటర్ ఫలితాలు ఓ బాలిక ప్రాణాలను బలిగొన్నాయి. తక్కువ మార్కులు వచ్చాయని మనస్థాపంతో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన నల్లగొండ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. నల్లగొండ గాంధీనగర్‌కు చెందిన జాహ్నవి(16)కి ఇంటర్ పరీక్షల్లో తక్కువ మార్కులు రావడంతో బాలిక పేరెంట్స్ ఆమెను మందలించారు. దీంతో మనస్థాపానికి గురైన జాహ్నవి శుక్రవారం తెల్లవారుజామున రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది.

ఇదిలా ఉండగా ఇంటర్ పరీక్షల్లో మూడు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యాడన్న కారణంగా మనోవేదనతో నిజామాబాద్‌కు చెందిన మరో విద్యార్థి ఉరి వేసుకుని సూసైడ్ చేసుకున్నాడు.

Advertisement

Next Story