కేకేఆర్ కెప్టెన్‌గా ఎవరుంటారో చెప్పిన కోచ్

by Shyam |
Mc Cullam
X

దిశ, స్పోర్ట్స్: కరోనా కారణంగా అర్దాంతరంగా నిలిచిపోయిన ఐపీఎల్ 2021లోని మిగిలిన 31 మ్యాచ్‌లు యూఏఈ వేదికగా నిర్వహించనున్నారు. కాగా, ఐపీఎల్ రెండో దశ మ్యాచ్‌లకు ఆస్ట్రేలియాతో పాటు ఇంగ్లాండ్ జట్టుకు చెందిన పలువురు క్రికెటర్లు రావడం లేదనే విషయం తెలిసిందే. ఇంగ్లాండ్ జట్టు పరిమిత ఓవర్ల కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ అంతర్జాతీయ షెడ్యూల్ కారణంగా ఐపీఎల్‌కు గైర్హాజరు కావడంతో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు కొత్త కెప్టెన్‌ను వెతుక్కునే పనిలో పడింది. ఆ జట్టుకు ఇంతకు ముందు కెప్టెన్‌గా వ్యవహరించిన దినేశ్ కార్తీక్‌తో పాటు సీనియర్ క్రికెటర్ ఆండ్రీ రసెల్ కెప్టెన్సీపై ఆసక్తి కనపరుస్తున్నారు. అయితే కోచ్ బ్రెండన్ మెకల్లమ్ మాత్రం యువకులకు ఆ బాధ్యతలు అప్పగించాలని చూస్తున్నట్లు చెప్పాడు. మెకల్లమ్‌తో పాటు కేకేఆర్ యాజమాన్యం శుభ్‌మన్ గిల్ లేదా నితీశ్ రాణాకు జట్టు పగ్గాలు అప్పజెప్పడానికి ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తున్నది. భారత యువ క్రికెటర్లు ఈ అవకాశాన్ని ఉపయోగించకుంటే బాగుంటుందని మెకల్లమ్ వ్యాఖ్యానించడం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed