14తీర్మానాలకు జీహెచ్ఎంసీ స్టాండింగ్ క‌మిటీ ఆమోదం

by Shyam |
14తీర్మానాలకు జీహెచ్ఎంసీ స్టాండింగ్ క‌మిటీ ఆమోదం
X

దిశ, న్యూస్​బ్యూరో: జీహెచ్​ఎంసీ కొత్త స్టాండింగ్​ కమిటీని గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం న‌గ‌ర మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ అధ్యక్షత‌న స్టాండింగ్ క‌మిటీ స‌మావేశం నిర్వహించి 14 తీర్మానాలను ఆమోదించారు. గ‌తంలో మాదిరిగానే ప్రతీ గురువారం స్టాండింగ్ క‌మిటీ స‌మావేశాన్ని నిర్వహించాల‌ని కమిటీ ఆమోదించింది. సికింద్రాబాద్‌, చార్మినార్‌, ఖైర‌తాబాద్‌, ఎల్బీన‌గ‌ర్‌, శేరిలింగంప‌ల్లి జోన్లలో రోడ్లపై ఏర్పడిన గుంత‌ల‌ను వార్షిక కాంట్రాక్ట్ ద్వారా పాట్‌హోల్ రిపేర్ మిష‌న్‌తో చేసేందుకు క‌మిటీ ఆమోదించింది. ఐటీ విభాగంలో ప‌నిచేస్తున్న 28మంది నిపుణుల సేవ‌ల‌ను మ‌రో మూడేళ్ల పాటు పొడిగించడంతో పాటు ఐదు యానిమ‌ల్ కేర్ సెంట‌ర్లను 24/7 ప‌ద్దతిలో ప‌నిచేయించేందుకు ప్రస్తుతం ఉన్న 15మంది పారా వెట‌ర్నరీ సిబ్బందికి అద‌నంగా మ‌రో ఐదుగురిని ఔట్ సోర్సింగ్ ప‌ద్దతిలో నియ‌మించేందుకు కమిటీ తీర్మానించింది. ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ లోకేష్ కుమార్‌తో పాటు స్టాండింగ్ క‌మిటీ స‌భ్యులు పాల్గొన్నారు.

Advertisement

Next Story