- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
35 వేల ఉద్యోగాలను భర్తీచేశాం: ఘంటా చక్రపాణి
దిశ, తెలంగాణ బ్యూరో : గడచిన ఆరేళ్ళలో రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా మొత్తం 35,724 పోస్టులకు రిక్రూట్‌మెంట్ జరిగిందని, కేవలం 919 పోస్టులు మాత్రమే కోర్టు కేసుల కారణంగా భర్తీ కాకుండా పెండింగ్‌లో ఉన్నాయని చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 36,758 పోస్టుల్ని ఖాళీగా ఉన్నట్లు గుర్తించి భర్తీ చేయాలని భావించిందని, వీటన్నింటికీ నోటిఫికేషన్‌ను జారీ చేశామని, ఈ ఆరేళ్ళలో పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడి, కౌన్సిలింగ్, ఇంటర్‌వ్యూ, రిక్రూట్‌మెంట్ లాంటివన్నీ పూర్తిచేశామని తెలిపారు. మరికొన్ని రోజుల్లో పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో గవర్నర్‌ను గురువారం రాజ్‌భవన్‌లో కలిసి వార్షిక నివేదికను సమర్పించారు. ఆ నివేదికను పరిశీలించిన గవర్నర్ సంతృప్తి వ్యక్తం చేశారు.
గవర్నర్‌తో భేటీ అనంతరం ప్రొఫెసర్ చక్రపాణి మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వం మొత్తం ప్రకటించిన 36,758 ఖాళీ పోస్టులకుగాను నోటిఫికేషన్లను జారీ చేసి 31,052 నియామకాలకు సంబంధించి మళ్ళీ ప్రభుత్వానికి పూర్తి వివరాలను అందజేశామని, ఇంకా 4,672 పోస్టులకుగాను సెలక్షన్ ప్రక్రియ జరుగుతూ ఉన్నదని, కొన్ని రోజుల్లోనే అది పూర్తవుతుందన్నారు. మరో 115 పోస్టులకు ఇటీవలే పరీక్షలు ముగిశాయని, తదుపరి ప్రక్రియ జరుగుతూ ఉందని తెలిపారు. కోర్టుల్లో కేసుల కారణంగా 919 పోస్టుల్ని మాత్రం భర్తీ చేయలేకపోయామన్నారు.
భర్తీ చేసిన పోస్టుల్లో ఎక్కువగా వ్యవసాయ శాఖలో అధికారుల నియామకం, వివిధ రకాల విద్యా సంస్థల్లో ఉపాధ్యాయుల నియామకం, సివిల్ ఇంజనీర్ల పోస్టుల భర్తీ లాంటివి ఉన్నాయన్నారు. దాదాపు ఇరవై వేల మంది వీటికి సంబంధించినవారేనన్నారు. ఇక గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 కు సంబంధించి ఈ కమిషన్ మాత్రమే కాక గత ప్రభుత్వాల హయాంలో పెండింగ్‌లో ఉన్నవి కూడా పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ ఆరేళ్ళలో ఎక్కడా ప్రలోభాలు, పైరవీలు, అవినీతి, అక్రమాలు, అవకతవకలకు తావు లేకుండా పూర్తి పారదర్శకంగా రిక్రూట్‌మెంట్ నిర్వహించామని చక్రపాణి సంతృప్తి వ్యక్తం చేశారు.
గవర్నర్‌ను కలిసినవారిలో చక్రపాణితో పాటు సభ్యులు విఠల్, చంద్రావతి, మొహమ్మద్ మతీనుద్దీన్ కాద్రి, కృష్ణారెడ్డి, సాయిలు, కమిషన్ కార్యదర్శి వాణీప్రసాద్ తదితరులు ఉన్నారు. మిగిలిన రాష్ట్రాల్లోని సర్వీస్ కమిషన్‌లు, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లతో పోలిస్తే తెలంగాణ ఏ రకంగా భిన్నంగా ఉందో, ప్రశ్నాపత్రాల రూపకల్పన మొదలు వాటిని దిద్దడం, మార్కులు వేయడం, ర్యాంకింగ్‌లు ఇవ్వడం.. ఇవన్నీ క్లౌడ్ ఆధారంగా కంప్యూటర్ ద్వారానే జరిగినట్లు గవర్నర్‌కు వివరించారు. ఆరేళ్ళలో సాధించిన ఫలితాలు, వచ్చిన వివాదాలు, కోర్టు కేసులు తదితరాలన్నింటిపై గవర్నర్ ఆరా తీసి కమిషన్ పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. మరికొన్ని రోజుల్లో చక్రపాణి సహా మొత్తం కమిషన్ సభ్యుల పదవీకాలం పూర్తికానుంది.