రిలయన్స్‌లో నాలుగో అతిపెద్ద వాటా కొనుగోలు!

by  |
రిలయన్స్‌లో నాలుగో అతిపెద్ద వాటా కొనుగోలు!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ టెలికాం రిలయన్స్ జియోలో అమెరికాకు చెందిన సంస్థ జనరల్ అట్లాంటిక్ 1.34 శాతం వాటా కొనుగోలుతో రూ. 6,598 కోట్లను వెచ్చించింది. గడిచిన నాలుగు వారాల్లో జియో కంపెనీలో ఫేస్‌బుక్, సిల్వర్ లేక్ పార్ట్‌నర్స్, విస్టా ఈక్విటీ పార్ట్‌నర్స్, జనరల్ అట్లాంటిక్ సంస్థలు రూ. 67,195 కోట్లను పెట్టుబడులు పెట్టాయి. ఈ సందర్భంలో దేశ ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లడానికి డిజిటల్ కనెక్టివిటీ ఎంతో కీలకమని భావించే ముఖేశ్ అంబానీతో కలిసి ప్రయాణిస్తామని, ఇండియాలో డిజిటల్ విప్లవానికి జియోతో కలిసి పని చేయనున్నట్టు జనరల్ అట్లాంటిక్ సీఈవో బిల్ ఫోర్డ్ తెలిపారు. ఇండియాలో డిజిటల్ సొసైటీని పటిష్టపరచడానికి ప్రపంచ టెక్ దిగ్గజ సంస్థల పెట్టుబడులతో మార్గం మరింత సుగుమం అవుతుందని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఓ ప్రకటనలో వెల్లడించింది.


Next Story

Most Viewed