- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
భద్రాద్రి పవర్ ప్లాంట్ ను సందర్శించిన జెన్‌కో సీఎండీ ప్రభాకర్
దిశ, మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని చిక్కుడుగుంట ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న భద్రాద్రి పవర్ ప్లాంట్ ను జెన్కో సీఎండీ ప్రభాకర్ సందర్శించారు. సోమవారం ప్లాంట్ అధికారులు సీఎండీ ప్రభాకర్ కి ఘనంగా స్వాగతం పలికారు. సీఎండీ పవర్ ప్లాంట్ రెండు రోజుల పర్యటనలో భాగంగా అధికారుల ఆధ్వర్యంలో అన్ని పనులను పర్యవేక్షించారు. మొదటి రోజు పర్యటనలో భాగంగా రైల్వేట్రాక్ పనులను పరిశీలించి పనులను వేగవంతం చేయాలని ఉన్నతాధికారులకు సూచించారు. అనంతరం పవర్ ప్లాంట్ లోపల ఉన్న కోల్డ్ ప్లాంట్ ను సందర్శించి పనులను పరిశీలించి కోల్డ్ ప్లాంట్ లో ఉన్న వ్యాగన్ చిప్స్ పనులను పరిశీలించి పనులను వేగవంతం చేయాలని అధికారులకు తెలిపారు.
అనంతరం ప్లాంట్ కి దూరంగా నిర్మిస్తున్న యాష్ పాండ్ ను సందర్శించి,పనులను పరిశీలించి మరో నూతన యాష్ పాండ్ కు స్థలం గురించి అధికారులతో చర్చించారు. ఆ తరువాత సెక్యూరిటీ గాడ్స్ కోసం నిర్మించే బిల్డింగ్ కార్యాలయాన్ని పరిశీలించి సెక్యూరిటీ గాడ్స్ సమస్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎం.సీ.ఆర్ హాల్ నందు ఉన్నతాధికారుల ముఖ్య సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ప్లాంట్ లో జరుగుతున్న పనులను వేగవంతం చేయాలని, పనుల పట్ల అశ్రద్ధ వహించద్దని సూచించారు .సమావేశం అనంతరం మండలంలోని కొండాయిగూడెం ప్రాంతంలోని ఇంటెక్ వెల్ ని సందర్శించి పనులను,స్థలాన్ని, వాటర్ పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ప్లాంట్ అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు డీఈలు,ఏఈలు, తదితర అధికారులు,కార్మికులు పాల్గొన్నారు.