‘పొట్టి ప్రపంచ కప్‌.. భారత్‌కు ఛాన్సివ్వాలి’

by vinod kumar |
‘పొట్టి ప్రపంచ కప్‌.. భారత్‌కు ఛాన్సివ్వాలి’
X

ఈ ఏడాది అక్టోబర్‌లో ఆస్ట్రేలియాలో నిర్వహించాల్సిన టీ20 వరల్డ్ కప్‌ వేదికను భారత్‌కు తరలించాలని మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత సునిల్ గవాస్కర్ సూచించారు. కరోనా వైరస్ ప్రభావంతో విదేశీయుల రాకపోకలపై ఆస్ట్రేలియా ఆరునెలల పాటు విధించిన నిషేధం.. సెప్టెంబర్‌ చివరన ముగుస్తుందని గవాస్కర్ చెప్పారు. దీంతో అక్టోబర్‌లో ప్రారంభమయ్యే టీ20 టోర్నీలో పాల్గొనే ఇతర దేశాల జట్లు.. అక్కడి పరిస్థితులకు అలవాటు పడేందుకు తగినంత సమయం ఉండదన్నాడు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది టోర్నీని ఇండియాకు.. వచ్చే ఏడాది ఇండియాలో జరగాల్సిన టీ20 వరల్డ్ కప్‌ను ఆస్ట్రేలియాకు మార్చాలని కోరాడు. ఈ మేరకు ఇరు దేశాల క్రికెట్ బోర్డులు మాట్లాడుకొని ఐసీసీకి తెలియజేస్తే బాగుంటుందని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.

అంతే కాకుండా టీ20 వరల్డ్ కప్ వేదికను ఇండియాకు మార్చి, అంతకన్నా ముందే ఐపీఎల్ నిర్వహిస్తే అన్ని దేశాల క్రికెటర్లకు మ్యాచ్ ప్రాక్టీస్ లభిస్తుందని గవాస్కర్ సూచించాడు. అలాగే ఆసియా కప్‌ను డిసెంబర్‌లో జరిపితే ఈ మూడు టోర్నీలకు ఎలాంటి ఆటంకం లేకుండా షెడ్యూల్ రూపొందించవచ్చని ఈ లిటిల్ మాస్టర్ తెలిపాడు. మరి గవాస్కర్ ప్రతిపాదనపై బీసీసీఐ, క్రికెట్ ఆస్ట్రేలియాతో పాటు ఐసీసీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

Tags: Sunil Gavaskar, WT20, Australia, India, ICC, IPL

Advertisement

Next Story

Most Viewed