నా డ్రీమ్ టీమ్‌కు అతనే కెప్టెన్ : గంభీర్

by Shyam |
నా డ్రీమ్ టీమ్‌కు అతనే కెప్టెన్ : గంభీర్
X

న్యూఢిల్లీ: కరోనా కారణంగా ఇంట్లోనే టైమ్ స్పెండ్ చేస్తున్న తాజా, మాజీ క్రికెటర్లు.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ తన డ్రీమ్ టీమ్‌ను ప్రకటించాడు. తన టీమ్‌లో గవాస్కర్, ధోనీలకు చోటు కల్పించిన గంభీర్.. కెప్టెన్‌గా మాత్రం మాజీ టెస్టు సారథి అనిల్ కుంబ్లేనే ఎంచుకున్నాడు. ‘గంగూలీ, ధోనీ, కోహ్లీ మాదిరిగా కుంబ్లే ఎక్కువ కాలం కెప్టెన్‌గా ఉండుంటే ఎన్నో రికార్డులు సృష్టించేవాడని, అంతేకాక ఆ టైమ్‌లో డీఆర్ఎస్ ఉండుంటే కచ్చితంగా 900 వికెట్లను తీసేవాడని గంభీర్ అభిప్రాయపడ్డాడు.

‘జట్టులో తన స్థానంపై భరోసా కల్పించిన ఏకైక కెప్టెన్ కుంబ్లే మాత్రమేనని.. అతని కోసం తన జీవితాన్ని త్యాగం చేసేందుకైనా సిద్ధమే’ అంటూ కుంబ్లేపై గంభీర్ తన అభిమానాన్ని చాటుకున్నాడు. తాను టీమ్ ఇండియాకు కుంబ్లే కెప్టెన్సీలో ఆడిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశాడు.

గంభీర్ ఆల్‌టైమ్ టీమ్ ఇండియా టెస్టు జట్టు ఇదే:

అనిల్ కుంబ్లే (కెప్టెన్), సునీల్ గవాస్కర్​, వీరేంద్ర సెహ్వాగ్​, రాహుల్ ద్రవిడ్​, సచిన్ టెండూల్కర్​, విరాట్ కోహ్లి, కపిల్​దేవ్​, ఎంఎస్ ధోని, హర్భజన్‌ సింగ్​, జహీర్ ఖాన్​, జవగళ్ శ్రీనాథ్

Tags: Anil Kumble, Team India, Gautam Gambhir, Captain, All Time Favorite Team, Cricket

Advertisement

Next Story