- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
షారుక్ కూతురి దివా లుక్.. క్రెడిట్ తల్లిదే!
సుహానా ఖాన్.. బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ కూతురు. తన లుక్స్, పోస్ట్‌లతో సోషల్ మీడియా సంచలనంగా మారింది. ఈ మధ్య తన ఇన్‌స్టాగ్రాం ఖాతాను పబ్లిక్ చేసిన సుహానా.. లక్షల మంది ఫాలోవర్స్‌ను సంపాదించుకుంది. దీంతో ఒక్క పోస్ట్ చేస్తే చాలు వెంటనే లైక్స్, కామెంట్స్‌తో నెట్టింట వైరల్ అవుతోంది. కాగా విదేశాల్లో చదువుతున్న ఈ స్టార్ కిడ్.. ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా తల్లిదండ్రులతో ముంబైలోనే ఉంది.
అయితే ఈ సమయంలో తల్లి గౌరీఖాన్.. సుహానాను ఫోటో షూట్ చేసి.. ఆ ఫోటోలను తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో షేర్ చేసింది. విత్ ఔట్ మేకప్‌లో తీసిన ఈ ఫొటోలు.. సుహానా అందానికి దాసోహం అంటుండగా.. గౌరీఖాన్ ఫొటోగ్రఫీకి సైతం అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా తన ఫ్యాషన్ సెన్స్ గురించి చర్చ జరుగుతోంది. బాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనన్య పాండే అయితే.. 'సుహానా డ్రెస్ తనకు నచ్చిందని.. కానీ తను నాకు ఇవ్వలేదు కదా' అంది. దీనికి రిప్లై ఇచ్చిన సుహానా.. 'ఇంతకు ముందు నా దగ్గర తీసుకున్న డ్రెస్ రిటర్న్ ఇచ్చెయ్' అంది. కాగా అనన్య, సుహానా బెస్ట్ ఫ్రెండ్స్.
కొన్ని నెలల క్రితం వోగ్ మ్యాగజైన్‌పై మెరిసిన సుహానా అభిమానులను ఆకట్టుకుంది. దీంతో తన బాలీవుడ్ ఎంట్రీ గురించి వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్.