- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
"గంగమ్మ తల్లికి దండమెట్టి బయల్దేరారు"
![గంగమ్మ తల్లికి దండమెట్టి బయల్దేరారు గంగమ్మ తల్లికి దండమెట్టి బయల్దేరారు](https://dishadaily.com/wp-content/uploads/2020/05/fisher-man.jpg)
మత్స్యకారులకు తల్లీ, తండ్రీ, గురువు, దైవం అన్నీ గంగమ్మతల్లే… ఏపని ప్రారంభించినా గంగమ్మ దయతోనే.. అలా గంగమ్మ దయతోనే, ఆమెపై భారం వేసే సుదూర తీరాల నుంచి బయల్దేరి శ్రీకాకుళం చేరారు. వారి ప్రయాణపు విశేషాల్లోకి వెళ్తే…
కాకుళం జిల్లాలో ఇచ్ఛాపురం, కవిటి, సోంపేట, వజ్రపుకొత్తూరు, సంతబొమ్మాళి, మందస, టెక్కలి, నరసన్నపేట, గార, రణస్థలం, ఎచ్చెర్ల తదితర మండలాల్లో వేలాది మంది మత్స్యకారులు నివసిస్తున్నారు. సుమారు 202 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్నప్పటికీ జెట్టీలు, ఉపాధి అవకాశాలు లేక వలసబాట పడుతున్నారు.
చెన్నై, కోచి, గోవా, ముంబాయి, గుజరాత్, అండమాన్ వంటి ప్రాంతాలకు వలస పోయి చేపలవేట సాగిస్తూ పొట్టపోసుకుంటున్నారు. ఏటా ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు చేపల వేటకు సెలవు. ఈ ఏడాది మార్చి 22 నుంచి లాక్‌డౌన్ అమలులోకి వచ్చింది. దీంతో పడవల యజమానులు సెలవులు ఇచ్చేశారు. ప్రయాణ సాధనాలు లేవు. చావోరేవో పుట్టినూరిలోనే జరగాలని మత్స్యకారులు భావించారు.
దీంతో అంతా కూడబలుక్కుని ఊరు చేరేందుకు సాధనాలు లేక తలా 8 వేల రూపాయలు కూడబెట్టారు. 20 నుంచి 30 మంది ప్రయాణించగలిగే 5 మరపడవలు కొనుగోలు చేశారు. చెన్నై నుంచి శ్రీకాకుళానికి వెయ్యి కిలోమీటర్ల దూరం… భారాన్నంతా గంగమ్మతల్లిపై వేసి, గంగమ్మకో దండంపెట్టి మరపడవల్లో బయల్దేరారు. ఇంతలో తుపాను వచ్చింది. నాలుగు రోజుల ప్రయాణం కాస్తా ఐదు రోజులకి చేరింది. ఎట్టకేలకు వారంతా స్వస్థలాలకు చేరుకున్నారు.
Tags: corona effect, fishermen, srikakulam district, ocean journey, ap