ఇంజినీరింగ్ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్.. నగ్నంగా నడిరోడ్డుపై వదిలి

by Sumithra |   ( Updated:2021-02-10 11:57:09.0  )
ఇంజినీరింగ్ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్.. నగ్నంగా నడిరోడ్డుపై వదిలి
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నగరశివారులో దారుణ ఘటన వెలుగుచూసింది. కాలేజీ నుంచి ఇంటికెళ్తున్న విద్యార్థినిపై ఆటో గ్యాంగ్ అఘాయిత్యానికి పాల్పడ్డారు. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలోని ఓ ప్రైవేట్ కాలేజీలో బీ.ఫార్మసీ సెకండ్ ఇయర్ చేస్తున్న విద్యార్థిని కాలేజీ ముగియగానే ఇంటికి బయల్దేరింది. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగారం వద్ద బస్సు దిగిన యువతి.. ఆర్.ఎల్‌ నగర్‌కాలనీలోని ఇంటికెళ్లడానికి ఓ ఆటోను ఎక్కింది. యువతి ఒంటరిగా ఉందని కన్నేసిన ఆటో డ్రైవర్ మరో ముగ్గురు స్నేహితులను మార్గ మధ్యలో ఎక్కించుకున్నాడు.

అనంతరం దారి మళ్లించి నేరుగా ఘట్కేసర్ పరిధి జోడిమెట్ల వద్ద చెట్ల పొదల్లోకి బలవంతంగా లాక్కెల్లారు. నలుగురు కలిసి అమ్మాయిపై గ్యాంగ్ రేప్ చేశారు. కోరిక తీర్చుకున్న కామాంధులు బాధితురాలిని రోడ్డు పక్కనే పడేశారు. రోడ్డు వెంట వెళ్తున్న స్థానికులు బాధితురాలిని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువతిని వెంటనే మెరుగైన చికిత్స నిమిత్తం నారపల్లిలోని క్యూర్ హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆస్పత్రి వద్దకు చేరుకొని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Next Story