- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గాంధీ, ఉస్మానియాలో మరో నిర్వాకం.. సర్జరీల ప్రాక్టీస్ లేకుండనే సర్టిఫికెట్స్
దిశ, తెలంగాణ బ్యూరో : సర్కార్టీచింగ్ఆసుపత్రుల్లో సరైన ల్యాబ్‌లు లేక మెడికల్విద్యార్థులు పూర్తిస్థాయి శిక్షణ పొందలేకపోతున్నారు. గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లోనూ ఇదే పరిస్థితి నెలకొన్నది. ముఖ్యంగా కార్డియాలజీ విభాగాపు కోర్సుల ప్రాక్టీస్‌కు సమస్యలు వస్తున్నాయి. దాదాపు రెండేళ్లుగా ఈ రెండు ఆసుపత్రుల్లో క్యాథ్ల్యాబ్స్పనిచేయడం లేదు. దీంతో మెడికోలు సర్జరీల ప్రాక్టీసుకు దూరమవుతున్నారు. ప్రస్తుతం రెండు కాలేజీల్లో సుమారు 30 మంది కార్డియాలజీ స్పెషాలిటీ విద్యార్థులున్నారు. కానీ క్యాథ్ ల్యాబ్స్ పనిచేయకపోవడంతో ఆపరేషన్లను ప్రాక్టీస్చేసే అవకాశం లేదు.
ఇప్పటికే గాంధీలో రెండు బ్యాచ్‌లు, ఉస్మానియాలో ఓ బ్యాచ్ స్టూడెంట్లు ఆపరేషన్లు ప్రాక్టీస్లేకుండానే సూపర్ స్పెషాలిటీ కోర్సులు పూర్తి చేశారు. తాము అడిగినప్పుడల్లా కొత్త ల్యాబ్స్వస్తున్నాయంటూ అధికారులు సాకులు చెబుతున్నారే తప్పా, ఇప్పట్లో అమలయ్యే అవకాశాలు కనిపించడం లేదని స్వయంగా మెడికోలు చెప్పడం గమనార్హం. దీంతో చేసేదేమీ లేక కార్డియాలజీ సూపర్‌స్పెషాలిటీ పూర్తి చేసినోళ్లు కార్పొరేట్ హాస్పిటళ్లలో అసిస్టెంట్లుగా చేరి సర్జరీలను నేర్చుకునేందుకు సిద్ధమయ్యారు. ప్రభుత్వాసుపత్రుల్లో ఇలాంటి పరిస్థితులు ఉంటే తామెలా నేర్చుకోవాలని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కార్డియాలజీ స్పెషాలిటీ కోర్సు విద్యార్థికి యాంజియోప్లాస్టీ, యాంజియోగ్రఫీ, వాల్వ్ రిప్లేస్‌మెంట్, పేస్‌మేకర్ వేయడం, నాళాల్లో పేరుకుపోయిన కొవ్వును తొలగించడం, స్టంట్స్ వేయడం వంటివన్నీ నేర్చుకోవడం తప్పనిసరి. క్యాథల్యాబ్స్ లేకపోవడంతో వారంతా ప్రాక్టీస్‌లు చేయలేకపోతున్నారు.
ప్రతీ రోజు 150 మంది..
గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో ప్రతీ రోజు సుమారు ఒక్కో ఆసుపత్రికి 100 నుంచి 150 మంది వివిధ రకాల గుండె సమస్యలతో వస్తున్నారు. అయితే ప్రాథమిక పరీక్షలు నిర్వహిస్తున్న వైద్యులు, సర్జరీలు, ఇతర ముఖ్యమైన టెస్టులకు నిమ్స్హాస్పిటల్కు రిఫర్ చేస్తున్నారు. అక్కడ కూడా రోగుల తాకిడి ఎక్కువగా ఉండటంతో ఆపరేషర్లకు వెయిటింగ్లిస్టును ఏర్పాటు చేశారు. ఇక ఆరోగ్య శ్రీ ఉన్నోళ్లనైతే నిమ్స్‌లో చేర్చుకోవట్లేదని సమాచారం. అయితే కొందరు నిమ్స్‌లో సర్జరీలు కోసం నిరీక్షిస్తుండగా, మరి కొందరు ప్రైవేట్‌కు వెళ్లిపోతున్నారు. మరోవైపు గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లోని కార్డియాలజీ విభాగాలకు చెందిన కొందరు డాక్టర్స్ నేరుగా ప్రైవేట్కురిఫర్ చేస్తున్నట్లు ఈ విభాగంలో చర్చ జోరుగా కొనసాగుతున్నది.