గెయిల్ ఇండియా త్రైమాసిక లాభం రూ.4,814 కోట్లు!

by Harish |
గెయిల్ ఇండియా త్రైమాసిక లాభం రూ.4,814 కోట్లు!
X

దిశ, సెంట్రల్ డెస్క్: 2019-20 ఆర్థిక సంవత్సరానికి మార్చితో ముగిసిన త్రైమాసికంలో ప్రభుత్వ యాజమాన్య సంస్థ గెయిల్ ఇండియా నికర లాభం 215.92 శాతం పెరిగి రూ. 4,813.88 కోట్లని వెల్లడించింది. అంతకుముందు ఇదే త్రైమాసికంలో రూ. 1,523.73 కోట్లుగా నమోదైంది. చివరి త్రైమాసికంలో కంపెనీ ఏకీకృత ఆదాయం 5.97 శాతం తగ్గి రూ. 17,938.08 కోట్లకు చేరుకుంది. సమీక్షించిన త్రైమాసికంలో కంపెనీకి రూ. 1,215.18 కోట్ల ట్యాక్స్ క్రెడిట్ లభించింది. అమ్మకాలు ఇంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈసారి 5.99 శాతం క్షీణించి రూ. 17,922.79 కోట్లని గెయిల్ ఇండియా రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. ఇక, పూర్తి ఆర్థిక సంవత్సరానికి కంపెనీ నికర లాభం 45.2 శాతం పెరిగి రూ. 9,514.64 కోట్లకు చేరుకుంది. అలాగే, కంపెనీ ఏకీకృత ఆదాయం 5.05 శాతం క్షీణించి రూ. 72,567.70 కోట్లకు చేరినట్టు ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది. స్వతంత్ర ప్రాతిపదికన, కంపెనీ నికర లాభం సంవత్సరానికి 169 శాతం పెరిగి రూ. 3,018.20 కోట్లకు చేరుకుంది.

Advertisement

Next Story

Most Viewed