ఇళ్ల వద్దకే నిత్యావసర సరుకులు : ఎస్పీ 

by Shyam |
ఇళ్ల వద్దకే నిత్యావసర సరుకులు : ఎస్పీ 
X

దిశ, మహబూబ్‌నగర్: కరోనా నియంత్రణలో భాగంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని జోగులాంబ గద్వాల ఎస్పీ అపూర్వరావు ఆదేశించారు. గద్వాల పట్టణంలోని కంటైన్మెంట్ జోన్‌లలో ఉన్న వారికి ఇండ్ల దగ్గరికే నిత్యావసర సరుకులు, రంజాన్ సందర్భంగా ఉపవాస దీక్షలు చేసే వారికి ఫుడ్, ఫ్రూట్ ఇంటి దగ్గరకు వచ్చేటట్టు చర్యలు చేపట్టాలని ఆమె పోలీస్, వైద్య, మున్సిపాలిటీ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా సోమవారం గద్వాల పట్టణంలోని కంటైన్మెంట్ జోన్‌లుగా ఉన్న మొమీన్‌మల్ల, రామ్‌నగర్, గంజి‌పేట్, నల్లకుంట ప్రాంతాలను ఆమె అధికారులతో కలిసి సందర్శించారు. అనంతరం కంటైన్మెంట్ జోన్ ఇన్‌చార్జిలుగా ఉన్న వైద్య, మున్సిపాలిటీ అధికారులతో మాట్లాడారు. కంటైన్మెంట్ జోన్‌లలో రోడ్లు, కాలనీ వీధుల్లో ఏర్పాటు చేసిన బారికేడ్స్‌ను ఎస్పీ పరిశీలించారు. కంటైన్మెంట్ జోన్‌లలో నిరంతరాయంగా గస్తీ నిర్వహించాలని, ఎవరినీ కూడా ఇంటి నుండి బయటకు రానివ్వొద్దని ఆదేశించారు. వీధులలో రోడ్ల మీదకు వచ్చే వారిని మొబైల్ ద్వారా ఫోటోలు తీసి
సంబంధిత అధికారులకు పంపి వారిపై కేసులు నమోదు చేయించాలని సిబ్బందికి సూచించారు.

Tags : Gadwala SP apoorwa rao, toured, containment zones, mahaboobanagar



Next Story

Most Viewed