గాదరిని పరామర్శించిన మంత్రి ప్రశాంత్ రెడ్డి

by Sridhar Babu |
గాదరిని పరామర్శించిన మంత్రి ప్రశాంత్ రెడ్డి
X

దిశ,తుంగతుర్తి: తుంగతుర్తి శాసనసభ్యులు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ కుటుంబాన్ని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మంగళవారం రాత్రి నల్లగొండలోని ఆయన నివాసంలో పరామర్శించారు. ఈ నెల 17న కిషోర్ కుమార్ తండ్రి మారయ్య మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ మేరకు మంత్రి ప్రశాంత్ రెడ్డి మారయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విషాదంలో ఉన్న కిషోర్ తో పాటు తల్లి సుజాత, కుటుంబ సభ్యులను ఆయన ఓదార్చారు. ఆయనతోపాటు ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి,మర్రి జనార్దన్ రెడ్డి,తదితరులు ఉన్నారు.

ఇదిలా ఉంటే మరోవైపు ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ,ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్,వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్,యూనియన్ ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్,టీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు గుజ్జ యుగేందర్ రావు,తెలంగాణ రాష్ట్ర జాగృతి ఉపాధ్యక్షులు మేడే రాజీవ్ సాగర్,ఆర్యవైశ్య సంఘం నాయకులు తాటికొండ సీతయ్య,ఓరుగంటి సత్యనారాయణ,బండారు దయాకర్,డిసిసిబి డైరెక్టర్ సైదులు,టీఆర్ఎస్ కెవి నియోజకవర్గ అధ్యక్షులు గౌడీచర్ల సత్యనారాయణ,తదితరులు వేరువేరుగా కిషోర్ ను పరామర్శించారు.

Advertisement

Next Story