- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఏపీ సర్కార్‌పై సోము వీర్రాజు ఫైర్
by srinivas |

X
దిశ, ఏపీ బ్యూరో: వైసీపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. కోడిగుడ్ల మీదనే ఏటా రూ.2,400 కోట్లు దోచుకుంటోందని విమర్శించారు. శనివారం విజయనగరంలో టీడీపీ సీనియర్ నేత గద్దె బాబూరావు బీజేపీలో చేరారు. ఈ కార్యక్రమంలో సోము వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై కేసులు పెడితే వారికి అండగా నిలుస్తామన్నారు. టీడీపీలో ఇంకా ఎవరైనా ఉంటే వారికి బీజేపీ స్వాగతం పలుకుతుందని చెప్పారు. అచ్చెన్నాయుడు టీడీపీకి అధ్యక్షుడా లేక చంద్రబాబు కుటుంబానికా అంటూ వ్యంగ్యాస్ర్తాలు సంధించారు. పార్టీలో చేరిన బాబూరావు మాట్లాడుతూ చంద్రబాబు ఎవరినైనా వాడుకొని వదిలేస్తారని విమర్శించారు.
Next Story