- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హైకోర్టు తీర్పుపై అప్పీలుకు వెళ్లిన ఫ్యూచర్ గ్రూప్!
దిశ, వెబ్‌డెస్క్: ఫ్యూచర్ గ్రూపునకు చెందిన ఆస్తులను రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు విక్రయించకూడదని అమెజాన్ సంస్థ వేసిన పిటిషన్‌కు అనుకూలంగా ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్ అప్పీల్‌ను దాఖలు చేసినట్టు బుధవారం తెలిపింది. రిలయన్స్ రిటైల్‌తో ఫ్యూచర్ గ్రూప్ రూ.24,718 కోట్ల ఒప్పందం విషయంలో అప్పుల్లో ఉన్న ఆస్తులను విక్రయించవద్దని ఫ్యూచర్ గ్రూప్‌తో పాటు, అధికారులను ఢిల్లీ హైకోర్టు ఆదేశాలిచ్చింది. తదుపరి ఆదేశాలు వచ్చేంతవరకు యథాతథ స్థితిని కొనసాగించాలని హైకోర్టు ఆదేశించింది. మంగళవారం ఈ ఆదేశాలపై చట్టపరమైన సహాయాన్ని తీసుకోనున్నట్టు ఫ్యూచర్ గ్రూప్ లిమిటెడ్ స్పష్టం చేసింది. ఇందులో భాగంగా ఫిబర్వరి 2, 2021 నాటి లేఖతో పాటు, అదేరోజు వెలువడిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా కంపెనీ హకోర్టులో అప్పీల్ దాఖలు చేశామని బుధవారం ఫ్యూచర్ గ్రూప్ లిమిటెడ్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది.