రాబోయే రోజులు కరోనా వ్యాప్తికి అనుకూలం : ఐఐటీ ఏయిమ్స్

by Shamantha N |
రాబోయే రోజులు కరోనా వ్యాప్తికి అనుకూలం : ఐఐటీ ఏయిమ్స్
X

దిశ, వెబ్ డెస్క్: రాబోయే రోజులు కరోనా వ్యాప్తికి బాగా అనుకూలంగా ఉంటాయని ఐఐటీ ఏయిమ్స్ తెలిపింది. ఇప్పటికే ఉత్తరాది రాష్ట్రాలు భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్నాయి. వర్షాకాలం ముగిసిన వెంటనే శీతాకాలం రానుండటంతో కరోనా వ్యాప్తిపై తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. చల్లని వాతావరణంలో వైరస్ మరింత విజృంభిస్తుందన్న ప్రచారమే కారణమని వివరించారు. ఈ నేపథ్యంలో భువనేశ్వర్ ఐఐటీ, ఎయిమ్స్ సంయుక్తంగా నిర్వహించిన ఓ అధ్యయనంలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి.

చలికాలంలో కరోనా వ్యాప్తి భారత్‌లో అత్యంత భీకరస్థాయికి చేరుతుందని పరిశోధకులు తెలిపారు. వర్షాల కారణంగా ఉష్ణోగ్రతలు తగ్గిపోతాయని, ఆ తర్వాత వచ్చే చలికాలం వాతావరణ పరంగా వైరస్ మనుగడకు అత్యంత అనుకూలమని ఐఐటీ భువనేశ్వర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ వినోజ్ తెలిపారు.

ఉష్ణోగ్రతల్లో పెరుగుదల కరోనా వ్యాప్తి క్షీణతకు కారణమవుతుందని, కానీ రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు భారీగా తగ్గనుండటమే ఆందోళన కలిగించే అంశమన్నారు. కేసులు రెట్టింపయ్యే పరిస్థితులపై ఉష్ణోగ్రత, వాతావరణంలో తేమ ఎంతో కీలకపాత్ర పోషిస్తున్నట్లు ఓ అధ్యయనం ద్వారా గుర్తించామన్నారు. వాతావరణంలో 1 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత పెరిగితే కరోనా కేసుల నమోదులో 0.99 శాతం తగ్గుదల కనిపిస్తుందని, కేసులు రెట్టింపయ్యే సమయం 1.13 రోజులకు పెరుగుతుందని స్పష్టంచేశారు.

Advertisement

Next Story

Most Viewed