నేషనల్ హైవే పై MLA బర్త్ డే వేడుకలు.. భగ్గుమన్న ఆమనగల్లు ప్రజలు

by Shyam |

దిశ, ఆమనగల్లు : కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పుట్టినరోజును పురస్కరించుకుని బుధవారం పార్టీ శ్రేణులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. కడ్తాల్, ఆమనగల్లు, తలకొండపల్లి, మాడ్గుల మండలాల్లో ఏకంగా రోడ్ షో తలపెట్టారు. ముందుగా తలకొండపల్లి మండల కేంద్రం మీదుగా కడ్తాల్, ఆమనగల్లులో భారీ ర్యాలీ నిర్వహించి కేకులు కట్ చేశారు. కడ్తాల్ మండల కేంద్రంలో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే జైపాల్ యాదవ్‌కు ఆయన తల్లి గుర్క మంగమ్మ కేక్ తినిపించి ఆశీర్వదించింది. ఆమనగల్లులో నిర్వహించిన వేడుకలల్లో ఎమ్మెల్యే పాల్గొని కేక్‌ కట్ చేసి పంచి పెట్టారు. అనంతరం మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులను అందజేశారు.

దీనికి ముందు మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అయితే, ఆమనగల్లులో జాతీయ ప్రధాన రహదారి పక్కన వేడుకలతో పాటు వాహనాలతో ర్యాలీ నిర్వహించడంతో కొద్ది సేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వేడుకల్లో జడ్పీటీసీలు అనురాధ పత్యానాయక్, దశరథ్ నాయక్, జిల్లా డీసీసీబీ డైరక్టర్ గంప వెంకటేష్, వైస్ ఎంపీపీ అనంతరెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు దోనదుల కుమార్, కౌన్సిలర్ రాధమ్మ, మున్సిపల్ కన్వీనర్ అప్పం శ్రీను, సర్పంచ్లు స్వప్న భాస్కర్ రెడ్డి, లక్ష్మీ నర్సింహారెడ్డి, జిల్లా నాయకులు అర్జున్ రావు, గిరియాదవ్, ఖలీల్, నిట్ట నారాయణ, నరేందర్, పంతు, శ్రీను పాల్గొన్నారు.

Advertisement

Next Story