- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పండ్ల వ్యాపారి హత్య కేసు నిందితులు అరెస్ట్
దిశ, ఎల్బీనగర్: పండ్ల వ్యాపారి హత్య కేసులో ఇద్దరు నిందితులను హయత్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పహాడిషరీఫ్ పరిధిలోని షహీన్ నగర్‌కు చెందిన మహ్మద్ గౌస్(45) వృత్తిరీత్యా కొత్తపేట పండ్ల మార్కెట్‌లో లేబర్ సూపర్ వైజర్‌గా పనిచేసేవాడు. అదే ప్రాంతానికి చెందిన మహ్మద్ సమీర్, కొత్తపేట పండ్ల మార్కెట్లో గత 10 సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు. ఆరేళ్ల క్రితం గౌస్, సమీర్‌కు ఒక షాపును మెయింటనెన్స్ కింద ఇచ్చాడు. సమీర్‌కు వచ్చే నెల 9న పెళ్లి జరగనుండటంతో పెళ్లి ఖర్చులకు గౌసును రూ.2లక్షలు ఇవ్వాలని కోరాడు. అందుకు గౌస్ అంగీకరించి చివరికి రూ.50 వేలు ఇచ్చి చేతులెత్తేశాడు. దీంతో సమీర్ పెళ్లి ఆగిపోయింది. సమీర్, గౌసు మధ్య మనస్పలు మొదలయ్యాయి.
కరోనా నేపథ్యంలో అధికారులు కొత్తపేట పండ్ల మార్కెట్‌ను కోహెడకు తరలించారు. దీంతో గౌస్ పండ్ల లోడింగ్, అన్ లోడింగ్ పెద్ద అంబర్పేటలోని కావేరి ఫంక్షన్ హాల్ నుంచి నిర్వహిస్తున్నాడు. చంచల్ గూడ ప్రాంతానికి చెందిన జిలాని రెహ్మన్ గిడ్డె, కొత్తపేటలోని పండ్ల మార్కెట్లోనే లేబర్ వర్క్ చేస్తుంటాడు. సమీర్ పథకం ప్రకారం జిలానీ సహాయంతో ఈ నెల 14న కావేరి ఫంక్షన్ హాలులో గౌసును కత్తితో పొడిచి హత్య చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న హయత్ నగర్ పోలీసులు దర్యాప్తు నిర్వహించి ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ తరలించారు.