- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొత్త సంవత్సరంలో ఖాతాదారులకు షాక్ ఇవ్వనున్న HDFC బ్యాంక్
దిశ, వెబ్‌డెస్క్ : కొత్త సంతవ్సరంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు తమ ఖాతాదారులకు షాక్ ఇవ్వనుంది. దేశీ దిగ్గజ ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ద్వారా కస్టమర్స్ ఎన్నోప్రయోజనాలు పొందుతున్నారు. కానీ ప్రస్తుతం బ్యాంకు తీసుకున్న నిర్ణయం ఖాతాదారులను కొంత వరకు ఇబ్బంది పెట్టనుందని తెలుస్తోంది. ఏటీఎం లావాదేవీల పరిమితి మించి ఉంటే ఛార్జ్ చెల్లించాల్సి ఉంటుందని భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్డర్స్ నేపథ్యంలో బ్యాంకులు 2022 జనవరి 1 నుంచి చార్జీలు వసూలు చేయడానికి రెడీ అయ్యాయి.
తాజాగా ఏటీఎం క్యాష్ విత్‌డ్రా చార్జీలు పెంచుతూ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో బ్యాంకు కస్టమర్స్‌పై భారం పడనుంది. బ్యాంక్ కస్టమర్లు ఏటీఎంకు వెళ్లి డబ్బులు తీసుకుంటే.. ఉచిత లావాదేవీల తర్వాత ప్రతి ట్రాన్సాక్షన్‌కు రూ.21 చార్జీ చెల్లించాల్సి ఉంటుందని బ్యాంక్ తెలిపింది. హెచ్‌డీఎఫ్‌సీ ఏటీఎం నుంచి నెలలో ఐదు సార్లు చార్జీలు లేకుండా క్యాష్ విత్‌డ్రా చేసుకోవచ్చు. ఆ తరవాత మాత్రం ప్రతి క్యాష్ విత్ డ్రావెల్‌కు రూ.21 కట్ అవుతుంది. అయితే నాన్ క్యాష్ విత్‌డ్రాయెల్ ట్రాన్సాక్షన్లకు చార్జీలు ఉండవు. దీని గురించి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు తమ ఖాతాదారులకు ముందే తెలియజేయడం జరిగింది. 2022 జనవరి 1 నుంచి ఇది అమలులోకి రానుంది.