- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కార్పెంటర్ టు కంటెంట్ క్యూరేటర్
దిశ, వెబ్‌డెస్క్: సవాళ్లను స్వీకరించడం, లక్ష్యం కోసం అలుపెరగకుండా పోరాటం చేయడం ఈ తరం స్పెషాలిటీ. అందుకే ప్రజెంట్ జనరేషన్‌లో చాలామంది పాతికేళ్లలోపే అద్భుత విజయాలు సాధిస్తూ ‘ఐకాన్’గా మారిపోతున్నారు. ఈ క్రమంలో కార్పెంటర్‌గా కెరీర్ మొదలుపెట్టిన 22 ఏళ్ల రాజు జంగిడ్.. ప్రస్తుతం కంటెంట్ క్యూరేటర్‌గా సత్తా చాటుతూ నేటి తరం ఆస్పిరెంట్స్‌కు బెస్ట్ ఎగ్జాంపుల్‌గా నిలుస్తున్నాడు.
రాజస్థాన్, జోద్‌పూర్ జిల్లాలోని ‘థడియా’ అనే చిన్న గ్రామంలో జన్మించిన రాజు.. చదువుకుంటూనే, కార్పెంటర్‌గా పనిచేసేవాడు. మాతృభాష(హిందీ)పై తనకున్న మమకారమే కెరీర్‌కు బాటలు వేసింది. రాజుకు వికీపీడియా పరిచమయ్యాక అందులో ఆర్టికల్స్‌ను చదవడాన్ని ఓ అలవాటుగా చేసుకున్నాడు. అయితే హిందీలో కంటెంట్ ఎక్కువగా లేకపోవడంతో పాటు తమ చుట్టుపక్కల గ్రామాల సమాచారం కూడా అందులో కనిపించలేదు. నిజానికి భారత్‌లో ఎక్కువగా మాట్లాడే భాష హిందీనే కాగా, వికీపీడియాలో ఆ భాషలో మరింత సమాచారం ఉండాలని భావించాడు. ఈ మేరకు తన కీపాడ్ మొబైల్ ఫోన్‌తో వికిపీడియా వలంటీర్‌గా చేరి, హిందీలో ఆర్టికల్స్ రాయడం మొదలుపెట్టాడు. అలా తాను 8వ తరగతిలో ఉండగానే. తహసీల్ ఆఫీస్ అధికారులతో మాట్లాడి తన ఊరి సమాచారాన్ని వికీపీడియాలో పోస్ట్ చేసేవాడు. అయితే పదో తరగతి (2015) తర్వాత చదువు మానేయడంతో కార్పెంటర్ పనిలో చేరాడు. రోజుకు 10-12 గంటలు కష్టపడుతూనే, వీలు చిక్కినప్పుడల్లా వీలైనన్నీ ఆర్టికల్స్ రాస్తూ, వికీపీడియా పేజీలను ఎడిట్ చేసేవాడు. రాజు పనితనం నచ్చడంతో తన పరిస్థితి తెలుసుకున్న వికీపీడియా నిర్వాహకులు అతడికి 2016లో ల్యాప్‌టాప్ గిఫ్ట్ ఇవ్వడంతో పాటు ఫ్రీ ఇంటర్నెట్ కనెక్షన్ కూడా అందించారు. ఇక అక్కడి నుంచి ఆ యంగ్ ఎడిటర్ వెనుతిరిగి చూడలేదు. అప్పటి నుంచి హైక్వాలిటీ కంటెంట్ ఇవ్వడంతో పాటు వికీపీడియా ఎడిటర్‌గా ఎన్నో సైబర్ కాన్ఫరెన్స్‌లకు అటెండ్ అయ్యాడు. ఈ క్రమంలో అతడు మొత్తంగా 57వేల వికీపీడియా పేజీలను ఎడిట్ చేయగా, 18వేల ఆర్టికల్స్ రాశాడు.
మనలో స్కిల్ ఎంతున్నా.. బలంగా పోరాడే సత్తా లేకపోతే పోరాటంలో గెలవలేమనే రాజు.. మధ్యలో ఆపేసిన తన చదువును కూడా కంటిన్యూ చేసి, బీఏ కంప్లీట్ చేశాడు. సైబర్ ఎడిటర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుని, ప్రస్తుతం వికీ స్పెషల్ ప్రాజెక్ట్ ‘వికీ స్వస్థ’కు పనిచేస్తున్నాడు. ఇందులో హెల్త్ -రిలేటెడ్ ఆర్టికల్స్ రాస్తూనే, తన ఫేవరెట్ గేమ్ క్రికెట్ ఆర్టికల్స్ కూడా అందిస్తున్నాడు. హిందీలో ‘వికీ క్రికెట్ ప్రాజెక్ట్’ ప్రారంభించి 700 ఆర్టికల్స్ కంట్రిబ్యూట్ చేశాడు. హిందీ భాషలో క్రికెట్‌కు సంబంధించిన ఆర్టికల్స్ తక్కువగా ఉండటంతో, మంచి సమాచారం అందిస్తున్న ఈ ప్రాజెక్ట్ సూపర్ సక్సెస్ సాధించింది.
ఇక ఇండియాలో హిందీ మాట్లాడే వారి సంఖ్య 341 మిలియన్లు కాగా, 1.4 లక్షల వికీపీడియా పేజీలో ఆ భాషలో అందుబాటులో ఉన్నాయి. వికీపీడియా కోసం పనిచేసే యాక్టివ్ రైటర్స్ కేవలం 1100 మందే ఉన్నారు.