అనాథ బాలికలకు డిప్లొమా కోర్సులలో ఉచిత బోధన

by Sridhar Babu |   ( Updated:2021-08-19 02:31:38.0  )
అనాథ బాలికలకు డిప్లొమా కోర్సులలో ఉచిత బోధన
X

దిశ, కాటారం: తల్లిదండ్రులను కోల్పోయిన అనాథ బాలికలకు మూడేళ్ల డిప్లొమా కోర్సులో ప్రభుత్వం ఉచిత విద్యకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. శ్రీమతి దుర్గాబాయి దేశ్ముఖ్ ప్రభుత్వ మహిళా టెక్నికల్ శిక్షణ సంస్థ హైదరాబాద్ నందు డిప్లమా కోర్సులకు 2020-2021 విద్యా సంవత్సరానికి తల్లిదండ్రులు కోల్పోయిన అనాథ బాలికలకు మాత్రమే మూడు సంవత్సరాల డిప్లమా కోర్సులలో ఉచిత విద్య కొరకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా సంక్షేమ అధికారి మహిళలు పిల్లలు దివ్యాంగులు, వయోవృద్ధుల శాఖ ప్రిన్సిపాల్ ఎం శారద ఒక ప్రకటనలో కోరారు.

సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ తదితర కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రతి కోర్సులో 60 సీట్లకు గానూ మొత్తం 24 లో 70 శాతం తల్లిదండ్రులు కోల్పోయిన నిరుపేద బాలికలకు కేటాయించారు. పాలిటెక్నిక్ అర్హత ప్రవేశ పరీక్ష రాయకున్నా కనీసం పదో తరగతి ఉత్తీర్ణత పొంది ఉండాలని, 3శాతం సీట్లు దివ్యాంగులకు కేటాయించినట్లు ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. కులం, ఆదాయ ధ్రువీకరణ, మరణ ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలి. కార్యాలయంలో లభించే దరఖాస్తు ఫారాలకు సంబంధించి ధ్రువపత్రాలను జత చేసి బాల రక్షా భవన్ కాకాజీ కాలనీ హనుమకొండ కార్యాలయం నందు ఆగస్టు 23వ తేదీలోపు ఇవ్వాలి. ఎంపికైన బాలికలకు ఉచిత విద్య, వసతి కల్పించబడును. పూర్తి వివరాలకు 9908429302, 9000630693 లను సంప్రదించాలని ప్రిన్సిపాల్ ఎం శారద తెలిపారు.

Advertisement

Next Story