ఎస్పీ కీలక నిర్ణయం.. నిరుద్యోగులకు ఉచిత పోలీస్ శిక్షణ

by Shyam |
ఎస్పీ కీలక నిర్ణయం.. నిరుద్యోగులకు ఉచిత పోలీస్ శిక్షణ
X

దిశ, కొత్తగూడ : రాష్ట్రవ్యాప్తంగా పోలీసు ఉద్యోగాల భర్తీకి త్వరలో ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లాలో ఆర్ధికంగా వెనుకబడి ఉన్న యువత కోసం, ఆసక్తి కలిగిన వారికి చేయూత అందించడానికి పోలీస్ శాఖ నడుం బిగించింది. జాబ్ కొట్టాలని ఉవ్విళ్లూరుతున్న యువతకు ఉచిత కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేయడానికి మహబూబాబాద్ జిల్లా పోలీసులు సన్నద్ధం అవుతున్నారు.

జిల్లా పరిధిలో కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ ఎన్. కోటి రెడ్డి ప్రకటించారు. ఈ ఉచిత కోచింగ్ సెంటర్‌లో శిక్షణ పొందాలనుకునే అభ్యర్థులు ముందుగా స్థానిక పోలీస్ స్టేషన్‌లో తమ పూర్తి వివరాలతో పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. ఇదొక సువర్ణావకాశమని, లక్ష్యం సాధించాలని ఆశయంగా పెట్టుకున్న యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

Advertisement

Next Story