- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మోసాల టీచర్.. చీటింగ్‌లో టాపర్

X
దిశ, వెబ్‌డెస్క్ : విశాఖ జిల్లాలో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడి మోసాలు వెలుగు చూశాయి. అమాయకులకు ఇళ్ల ప్లాట్లు ఇప్పిస్తానని చెప్పి లక్షల రూపాయలు దండుకున్నాడు. రమణబాబు అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఈ చీటింగ్‌కు పాల్పడ్డాడు. బాధితుల నుంచి రూ.19 లక్షలను అడ్వాన్స్ గా తీసుకుని ముఖం చాటేశాడు. అటు ప్లాట్లు ఇవ్వాక.. ఇటు తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో బాధితులు ఉపాధ్యాయుడు రమణ బాబుపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు వెంటనే రమణ బాబును అరెస్ట్ చేశారు. కాగా ఈ ఉపాధ్యాయుడు గతంలోనూ అదే తరహ మోసానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఆ ఘటనపై నర్సీపట్నం పీఎస్‌లో కేసు నమోదైనట్లు వెల్లడించారు.
Next Story