- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అమెజాన్ కస్టమర్ కేర్ పేరుతో మోసం
దిశ, క్రైమ్ బ్యూరో: అమాయకులే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఇప్పటివరకూ రకకరాల మోసాలకు పాల్పడిన నేరగాళ్లు తాజాగా నకిలీ కస్టమర్ కేర్ సెంటర్ నిర్వహిస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. శనివారం వారిని గుర్తించిన సైబర్ పోలీసులు అరెస్టు చేశారు. వివరాళ్లోకి వెళితే.. అమెజాన్ డాట్ కామ్‌లో ఇన్వర్టర్‌ను ఆర్డర్ చేసేందుకు ఓ మహిళ గూగుల్‌ను శోధించింది. గూగుల్‌లో లభ్యమైన నెంబరుకు ఫోన్ చేసి సంప్రదించింది. ఆ తరువాత తిరిగి కాల్ చేసిన సదరు మోసగాళ్లు రూ.10 పెనాల్టీ చెల్లించాలని, అందుకు గూగుల్ పే ఉపయోగించాలని చెప్పారు.
ఈ సందర్భంగా సదరు మహిళ వారు చెప్పినట్టుగా గూగుల్ పేలో అమౌంట్ పంపించింది. ఆ తర్వాత వెంటనే మూడు విడతలుగా మొత్తం రూ.99,967 లను డెబిట్ చేసుకున్నారు. అనంతరం ఆమె బ్యాంక్ స్టేట్‌మెంట్ తనిఖీ చేయగా, మోసపోయినట్టు గ్రహించింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే కేసు నమోదు చేసుకున్న సైబరాబాద్ సీసీఎస్ ఇన్ స్పెక్టర్ శ్రీనివాస్ దర్యాప్తు ప్రారంభించారు.