లివింగ్ లెజెండ్స్‌కూ శ్రద్ధాంజలి?

by Sujitha Rachapalli |
లివింగ్ లెజెండ్స్‌కూ శ్రద్ధాంజలి?
X

దిశ, వెబ్‌డెస్క్: మీడియా కొన్ని విషయాల్లో అత్యుత్సాహం చూపుతుంది. ముఖ్యంగా ప్రముఖుల విషయంలో.. వారు బతికి ఉండగానే చనిపోయారనే వార్తలు స్ప్రెడ్ చేస్తుంటుంది. ఇటీవల మీడియా అత్యుత్సాహానికి, సోషల్ మీడియా కూడా తోడైంది. ఫ్రెంచ్ బిజినెస్‌మెన్, పొలిటిషియన్, యాక్టర్, సింగర్, టీవీ హోస్ట్ బెర్నార్డ్ తైపే ఆరోగ్యంగా ఉన్నా కూడా మీడియా ఇప్పటికే అతడిని రెండు సార్లు చంపేసింది. ఇప్పుడు ఫ్రాన్స్‌కు చెందిన పబ్లిక్ రేడియో ఆర్‌ఎఫ్ఐ (రేడియో ఫ్రాన్స్ ఇంటర్నేషనల్) మరోసారి తైపేను చంపేసింది. తైపేను కాదు ఇప్పటికీ జీవిస్తున్న లివింగ్ లెజెండ్స్‌‌కు శ్రధ్దాంజలి ఘటించింది.

ఇటీవల వందమందికి శ్రద్ధాంజలి ఘటిస్తూ రేడియో ఫ్రాన్స్ ఇంటర్నేషనల్ ఓ ప్రకటన ఇచ్చింది. ఆ జాబితాలో ప్రస్తుతం జీవిస్తున్న ప్రముఖులు ఎందరో ఉండటంతో ఆ రేడియో నిర్వాహకులపై నెటిజన్లు, ఆ రేడియో శ్రోతలు మండిపడ్డారు. ఆర్‌ఎఫ్‌ఐ ఇచ్చిన ప్రకటనలో బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్, బ్రెజిలియన్ ఫుట్‌బాల్ హీరో పీలే, ఫ్రెంచ్ నటి బ్రిగిట్టె, అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మి కార్టర్, క్యూబా కమ్యూనిస్ట్ పార్టీ అగ్రనేత రౌల్ క్యాస్ట్రో, ఇరాన్ సుప్రీం లీడర్ అయాతోల్లాహ్ అలీ ఖామెనెయ్, నటుడు క్లింట్ ఈస్ట్‌వుడ్, సోఫియా లోరెన్‌లు ఉన్నారు. వీళ్లందరూ కూడా 80 -90 ఏళ్ల మధ్య వయసు ఉన్న ప్రముఖులే కావడం గమనార్హం.

https://twitter.com/RFI_En/status/1328351828275322881

కాగా నెటిజన్లు, ఆయా వ్యక్తులు అభిమానులు, ఆ రేడియో లిజనర్స్ అంతా కూడా ఆర్‌ఎఫ్‌ఐ మీద ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆ సంస్థ క్షమాపణలు చెబుతూ ట్వీట్ చేసింది. సాంకేతిక సమస్య వల్ల ఈ ప్రకటనలో తప్పులు దొర్లాయని, మరోసారి ఇలాంటి తప్పు జరగకుండా చూసుకుంటామని ఆర్‌ఎఫ్‌ఐ వెల్లడించింది. అయితే అప్పటికే జరగాల్సినదంతా జరిగిపోయింది. నెటిజన్లు ఆ ఫొటోలతో ఆ సంస్థను సోషల్ మీడియాలో ఏకిపారేశారు.

Advertisement

Next Story