- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రాహుల్ గాంధీకి సొంత ఇలాకాలోనే షాక్.. నలుగురు కీలక నాయకుల రాజీనామా
దిశ, వెబ్ డెస్క్: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేళ దక్షిణాది రాష్ట్రాలు తమిళనాడు, కేరళ, పాండిచ్చేరిలలో సుడిగాలి పర్యటనలు చేస్తున్న రాహుల్ గాంధీకి సొంత ఇలాకాలోనే షాక్ తగిలింది. ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న వయనాడ్‌లో కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు కీలక నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేశారు. వారం రోజుల్లోనే నలుగురు నాయకులు పార్టీని వీడటం కార్యకర్తల్లో ఆందోళన రేపుతున్నది. హస్తానికి రాజీనామా చేసిన నాయకులంతా సీపీఐ(ఎం) లో చేరడం గమనార్హం.
రాజీనామా చేసిన వారిలో పార్టీ సీనియర్ నాయకులు ఎంఎస్ విశ్వనాథన్, సుజయ వేణుగోపాల్, పి.కె. అనిల్ కుమార్, కెకె విశ్వనాథన్ ఉన్నారు. ఎంఎస్ విశ్వనాథన్ కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సెక్రెటరీగా ఉండగా, సుజయ మహిళా కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. ఇక పి.కె. అనిల్ కుమార్ ఇండియన్ నేషనల్ యూనియన్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ కాగా.. కెకె విశ్వనాథన్ కేపీసీసీ మెంబర్.
ఇది కూడా చదవండి : నందిగ్రామ్‌లో దీదీని ఢీకొనబోయేది ఆయనేనా..?
ఈ నలుగురు వారం రోజుల్లోనే హస్తాన్ని వీడి ఎర్రజెండా కండువా కప్పుకున్నారు. వయనాడ్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ముగ్గురి కబంధ హస్తాలలో బందీ అయిందనీ, వారి సొంత నిర్ణయాలతో పార్టీని భ్రష్టుపట్టిస్తున్నారని ఆరోపిస్తూ ఆ నలుగురు రాజీనామా సమర్పించారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ కీలక నాయకులు కాంగ్రెస్‌ను వీడటంపై జిల్లాలోనే గాక రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ క్యాడర్ నైరాశ్యంలోకి కూరుకుపోయింది.