- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
అధికారులపైనే దాడి…అందుకే అరెస్ట్..
by Sumithra |

X
దిశ వెబ్ డెస్క్: జీహెచ్ఎంసీ అధికారులపై దాడికి పాల్పడిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్యాయత్నం కేసులో నిందితులు కరీం ఆజాద్, ఆఫ్రోజ్, ఇమ్రాన్,సల్మాన్ లను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం… హఫీజ్ పేటలో అక్రమ నిర్మాణాల విషయం జీహెచ్ఎంసీ అధికారుల దృష్టికి వచ్చింది. దీంతో ఆ నిర్మాణాలను కూల్చేందుకు అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు హఫీజ్ పేటకు వెళ్లగా వారితో నలుగురు నిందితులు వాగ్వాదానికి దిగారు. దీంతో అధికారులపై నిందితులు కిరోసిన్ పోసి నిప్పంటించే ప్రయత్నం చేశారు. కాగా ఘటనపై పోలీసులకు అధికారులు ఫిర్యాదు చేశారు. దీంతో హత్యాయత్నం కేసు నమోదు చేసి నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
Next Story