ఢిల్లీలో కేసీఆర్‌ను ఎవరూ నమ్మరు : విజయశాంతి

by Shyam |
ఢిల్లీలో కేసీఆర్‌ను ఎవరూ నమ్మరు : విజయశాంతి
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం కేసీఆర్‌పై బీజేపీ నేత, మాజీ ఎంపీ విజయశాంతి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీలో కేసీఆర్‌ను ఎవరూ నమ్మే పరిస్థితి లేదని విమర్శించారు. ప్రోటోకాల్‌తో అపాయింట్‌మెంట్ తీసుకొని.. ప్రజలను మోసం చేసేందుకు కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు. త్వరలో కేసీఆర్ అవినీతి ఆరోపణలు రుజువు అవుతాయని హెచ్చరించారు. ఆరేండ్లుగా ప్రజలను మభ్యపెడుతూ.. కాలం గడుపుతున్న కేసీఆర్‌ ప్రభుత్వం కూలడం ఖాయం అన్నారు. కాగా ఇటీవల విజయశాంతి కాంగ్రెస్ నుంచి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story