కార్మికులకు మెరుగైన వైద్యం అందించండి : కవిత

by Aamani |
కార్మికులకు మెరుగైన వైద్యం అందించండి : కవిత
X

దిశప్రతినిధి, ఆదిలాబాద్:

మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్ RK-5 బి గనిలో బొగ్గు బ్లాస్టింగ్ కోసం హోల్స్ వేసే క్రమంలో మిస్ ఫైర్ అయింది. ఈ ప్రమాదంలో కోల్ కట్టర్ రత్నం లింగయ్య అనే కార్మికుడికి తీవ్రగాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే ఆయన్ను హైదరాబాద్‌కు తరలించారు.

ఈ ప్రమాదంలో కార్మికులు గాది శివయ్య, పల్లె రాజయ్య, చిలుక సుమన్ సైతం గాయపడ్డారు. వీరికి చికిత్స అందించేందుకు మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలిస్తున్నట్లు సింగరేణి అధికారులు వెల్లడించారు. కాగా, ఈ ఘటనపై మాజీ ఎంపీ కవిత ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘గాయపడిన కార్మికులు వెంటనే కోలుకోవాలని.. వారికి సింగరేణి సంస్థ నాణ్యమైన వైద్యం అందించాలని’ సింగరేణి బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ట్విట్టర్ ద్వారా కోరారు.

Advertisement

Next Story