- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ విషయంలో ఎమ్మెల్యేకు ఏంటి సంబంధం
దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వెనుక ఉన్న 300 గజాల కార్పొరేషన్ స్థలం కబ్జాదారులకు దారదాత్తం చేయడంలో అర్బన్ ఎమ్మెల్యేకు సంబంధం ఏంటని, మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ర్ట ఉపాధ్యక్షుడు యెండల లక్ష్మి నారాయణ ప్రశ్నించారు. మంగళవారం ఆయన పార్టీ కార్యాలయంలో విలేకరులతో యెండల మాట్లాడుతూ..
కొత్తగా ఏర్పడిన మున్సిపల్ కార్పొరేషన్ కార్యవర్గ సమావేశంలో కార్పొరేషన్‌కు చెందిన 300 గజాల స్థలాన్ని, ప్రైవేట్ వ్యక్తులకు కట్ట బెట్టడం కోసం తీర్మాణం చేయడం సిగ్గుచేటన్నారు. గత పాలకవర్గంలో అక్రమ నిర్మాణానికి, కబ్జాకు అధికార పార్టీ అండగా ఉందని ఆరోపించారు. నాడు పాలకవర్గ సమావేశాల్లో మేయర్‌ను పక్కన పెట్టి సమావేశాలను నిర్వహించిన అర్బన్ ఎమ్మెల్యేకు తెలియకుండా కార్పొరేషన్ క్వార్టర్‌ల స్థలం కబ్జాకు గురైందా అని ప్రశ్నించారు.
కబ్జాదారుల నుంచి ముడుపులు తీసుకుని దానికి ఓకే చేశారా అని ఎద్దేవా చేశారు. కబ్జాలకు పాల్పడితే చర్యలు తీసుకోవాల్సిన అధికార పార్టీ, అక్కున్న చేర్చుకుని పదవులు కట్టబెట్టారని ఆరోపించారు. మేయర్ భర్త పేదల ఇండ్లను కబ్జా చేయడం దారుణమన్నారు. జిల్లాలో అవినీతి అక్రమాలను ప్రశ్నించిన విలేఖరులపై నిజామాబాద్ రూరల్‌లో, బాన్సువాడలో అక్రమ కేసులు పెట్టించి వేధిస్తున్నారని ఆరోపించారు. అవసరమైతే విలేఖరులకు ఆండాగా ఉంటామని అన్నారు.