పారిశుధ్య పనులు చేసిన మాజీ ఎమ్మెల్యే

by Shyam |
పారిశుధ్య పనులు చేసిన మాజీ ఎమ్మెల్యే
X

దిశ, రంగారెడ్డి: సీజనల్‌ వ్యాధులపై పట్టణ ప్రజలు జాగ్రత్తలు పాటించాలని షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు ఆదివారం వ్యాధుల నివారణ కార్యక్రమానికి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపుతో శంషాబాద్ లోని ఆయన స్వగృహంలో స్వీయ పారిశుధ్య పనులు ప్రారంభించారు. పట్టణ ప్రజలు ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాల పాటు ఇంటితో పాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రతాప్ రెడ్డి పిలుపునిచ్చారు. శుభ్రం చేసే ఫొటోలను ఇతరులకు పంపి.. వారిని కూడా పారిశుధ్యం పనులు చేపట్టే విధంగా ప్రోత్సహించాలని ఆయన పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో సీజనల్ వ్యాధుల నివారణకు పారిశుధ్య యుద్ధం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

Next Story

Most Viewed