దోచుకోవడంలో ఆ ఎమ్మెల్యే అనుచరుల తర్వాతే ఎవరైనా..?

by Sridhar Babu |
vijayaramana-rao
X

దిశ, పెద్దపల్లి : పోలీసుల అండతో బెదిరింపులు, బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతూ పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, ఆయన తమ్ముడు రమణారెడ్డి, విలేఖరి రవికిశోర్‌లు పెద్దపల్లి జిల్లాను దోచుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకులు చింతకుంట విజయరమణరావు సంచలన ఆరోపణలు చేశారు. పెద్దపల్లిలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ కొలిపాక శ్రీనివాస్‌ను బెదిరించి పోలీసు అధికారులు, విలేఖరి రవికిషోర్ రూ.కోట్లు వసూలు చేశారన్నారు. దీనిని బట్టి జిల్లాలో ఎంత మేరకు దోపిడి జరుగుతుందో అర్థం అవుతుందని ఆరోపించారు.

పట్టణంలో అనేక మంది వ్యాపారులను బ్లాక్ మెయిల్ చేస్తూ దోపిడి చేస్తున్నారని ఆరోపించారు. కౌన్సిలర్ కొలిపాక శ్రీనివాస్ విషయంలో రామగుండం సీపీ సత్యనారాయణ చట్టపరమైన చర్యలు తీసుకుని తన చిత్తశుద్ధిని చాటుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో కౌన్సిలర్లు నూగిళ్ల మల్లయ్య, తూం సుభాష్ రావు, బూతగడ్డ సంపత్, బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు తాడూరి శ్రీమాన్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story