- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘అంబేద్కర్ ఆత్మ ఘోషిస్తోంది’
బడుగు, బలహీనవర్గాల అభివృద్ధిని అడ్డుకోవడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలకు అంబేద్కర్ ఆత్మ ఘోషిస్తోందని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ అన్నారు. హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద సోమవారం నిర్వహించిన ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ రిజర్వేషన్ల రద్దు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని విస్మరించి ముందుకు సాగుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు గుణపాఠం చెప్పాల్సిన సమయం వచ్చిందన్నారు. కాంగ్రెస్ మాత్రమే రాజ్యాంగ బద్ధమైన పాలన సాగించిందన్నారు. దళితులకు బడుగు, బలహీన వర్గాల వారికి వ్యతిరేకంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా వారికి కాంగ్రెస్ అండగా ఉంటుదన్నారు. రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పుతో దేశవ్యాప్తంగా బడుగు బలహీనవర్గాల ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విధానాలకు వ్యతిరేకంగా అడుగులు పడుతున్నయన్నారు. మన హక్కులు కాపాడుకోవడానికీ పోరాటం చేయవలసిన దౌర్భాగ్యం వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.