- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
భారత్‌లోకి నో ఎంట్రీ..
భారత్ నో ఎంట్రీ బోర్డు పెట్టేసింది. నో ఎంట్రీ బోర్డు పెట్టడం ఎంటనుకుంటున్నారా..చైనా మహామ్మరీ కరోనా వైరస్ బారిన పడుతున్నదేశాల సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతుండటం, ఆ దేశంలో వందల సంఖ్యలో ప్రజల ప్రాణాలు గాల్లో కలిసి పోతుండటంతో ఇండియాకు భయం పట్టుకుంది. ఇప్పటికే అగ్రరాజ్యం అమెరికా, ఉత్తరకొరియా, రష్యా లాంటి దేశాలు చైనా నుంచి వచ్చే విదేశీయులకు నో ఎంట్రీ చెప్పాయి. అదే కోవలోకి ప్రస్తుతం భారత్ వచ్చి చేరింది. జనవరి 15 తర్వాత చైనాకు వెళ్లిన విదేశీయులు ఎవరూ ఇండియాకు రావడానికి వీళ్లేదని డైరక్టరేట్ జనరల్ సివిల్ ఏవీయేషన్(డీజీసీఏ)తేల్చిచెప్పింది.అంతేకాకుండా రోడ్డు, జలమార్గాల్లోనూ ఈ ఆంక్షలు వర్తిస్తాయని తెలిపింది. మరోవైపు విమానాశ్రయాల్లో ఏర్పాటు చేసిన థర్మల్ స్ర్కీనింగ్ ద్వారా కరోనా పరీక్షలను సమర్ధవంతంగా నిర్వహించాలని, అనుమానితులను ఐసోలేషన్ వార్డులకు తరలించాలని డీజీసీఏ సూచించింది. ఇండియాలో రానురాను కరోనా అనుమానితుల సంఖ్య పెరుగుతుండటంతో రక్షణ చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు కేంద్ర అధికారిక వర్గాలు వెల్లడించాయి. కాగా కరోనా వైరస్ బారిన పడి ఇప్పటివరకూ చైనాలో 902మంది ప్రాణాలు కోల్పొయారు.