- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
చలికాలంలో జలుబు, దగ్గుతో బాధపడుతున్నారా.. అయితే ఇలా చేయండి
దిశ, వెబ్‌డెస్క్ : చలికాలంలో అనారోగ్య సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ కాలంలో తరచూ జలుబు చేస్తుంటుంది. చాలా మంది చిన్నచిన్న అనారోగ్య సమస్యలైన దగ్గు, జలుబు, రొంప, జ్వరం కనిపించగానే ఢీలాపడిపోతుంటారు. మందుల దుకాణానికి వెళ్లడం.. ఏదో ఒక యాంటీబయాటిక్ కొనితెచ్చుకుని వేసుకోవడం సాధారణంగా చేస్తుంటారు. ఇలా మందుల జోలికి వెళ్లకుండా ఇంట్లో దొరికే మామూలు వంట పదార్థాలతో రోగనిరోధకశక్తిని పెంపొందించుకోవచ్చు. చలికాలంలో తరచూ ఇబ్బంది పెట్టే దగ్గు, జలులు, గొంతు నొప్పి నుంచి సత్వరం ఉపశమనం పొందాలంటే గ్లాస్ పాలలో చిటికెడు పసుపు వేసుకొని తాగడం వలన మంచి ఫలితం ఉంటుంది. అంతే కాకుండా అల్లం టీ తాగడం వలన కూడా మంచి ఫలితం ఉంటుంది. గొంతు నొప్పి నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు.
చలికాలంలో చాలా మంది టీ, కాఫీలు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అయితే రోజుకి రెండు నుండి మూడు కంటే ఎక్కువ కప్పులు టీ తీసుకోవడం మంచిది కాదు. దీని వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. ఈ కాలంలో వ్యాధి నిరోధక శక్తి క్షీణిస్తుంది. కాబట్టి.. వ్యాధులు త్వరగా దాడి చేస్తాయి. ఆ సమస్య రాకుండా ఉండాలంటే వెల్లులిని ఎక్కువగా తీసుకోవడం చాలా మంచిది. అంతే కాకుండా చల్లని గాలులు, పొగ మంచులోకి అస్సలు వెళ్లకూడదు. తప్పకుండా వెళ్లాల్సి వస్తే ఉన్ని వస్త్రాలను ధరించండి. తల మీద మంచు పడకుండా ఏదైనా వస్త్రం లేదా క్యాప్ ధరిచడం మరీ మంచిది.
- Tags
- Cold
- health tips