రూ.50వేల కోట్లతో 'గరీబ్ కల్యాణ్ రోజ్ గార్ అభియాన్' పథకం!

by Harish |
రూ.50వేల కోట్లతో గరీబ్ కల్యాణ్ రోజ్ గార్ అభియాన్ పథకం!
X

ముంబయి: కరోనా వైరస్, లాక్‌డౌన్ వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వలస కార్మికులు, గ్రామీణ పౌరులకు జీవనోపాధి అవకాశాలు పెంచే లక్ష్యంతో ‘గరీబ్ కల్యాణ్ రోజ్ గార్ అభియాన్’పథకాన్ని ప్రధాని మోదీ జూన్ 20న ప్రారంభిస్తారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. గ్రామీణ ప్రాంతంలో ఉపాధి కల్పనే లక్ష్యంగా ఈ పథకాన్ని తీసుకువస్తున్నట్టు ఆమె పేర్కొన్నారు. గ్రామీణులతోపాటు స్వస్థలాలకు వెళ్లిన వలస కార్మికులకు ఉపాధి కల్పించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. 6 రాష్ట్రాల్లో 116 జిల్లాల్లో ఈ పథకాన్ని అమలు చేయనున్నట్టు వివరించారు. గరీబ్ కల్యాణ్ రోజ్‌గర్ అభియాన్ కింద 25 పథకాల సేవలను ఒక దగ్గరే అందిస్తామని చెప్పారు. 125 రోజుల వరకు ఈ కొత్త పథకం అందుబాటులో ఉంటుదని, దీనికోసం రూ.50వేల కోట్లు వెచ్చించనున్నట్టు పేర్కొన్నారు. ఉత్తర్‌ప్రదేశ్, ఝార్ఖండ్, ఒడిశా, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌ల్లో ఈ పథకం అమలు చేయనున్నట్టు పేర్కొన్నారు. 12 మంత్రిత్వ శాఖల సమన్వయంతో ఈ పథకాన్ని పూర్తిస్థాయిలో సమర్థవంతంగా అమలు చేస్తామని చెప్పారు. ప్రస్తుతం కార్మికులకుకు వచ్చే 4 నెలలపాటు ఉపాధి కల్పిస్తామని, తర్వాత పరిస్థితులపై ఆధారపడి తర్వాతి నిర్ణయం తీసుకోనున్నట్టు చెప్పారు. మొత్తం 116 జిల్లాల్లో ఒక్కో జిల్లాకు 25వేల మంది వలస కార్మికులు తిరిగి వచ్చినట్టు, వీరికి ఉపాధి కల్పించడమే గరీబ్ కల్యాణ్ రోజ్ గార్ అభియాన్ పథకం లక్ష్యమని వివరించారు.

Advertisement

Next Story

Most Viewed