ఆ ప్రాజెక్టుకు వరద కొనసాగుతూనే ఉంది

by Shyam |   ( Updated:2020-07-12 22:35:20.0  )
ఆ ప్రాజెక్టుకు వరద కొనసాగుతూనే ఉంది
X

దిశ, మహబూబ్‎నగర్: జూరాల ప్రాజెక్టు‌కు స్థిరంగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాల కారణంగా జూరాలకు వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో ఇప్పటికే నారాయణ పూర్ నుండి 2 గేట్లు ఎత్తి నీటిని కిందకు వదిలిన నేపథ్యంలో మంగళవారం నాటికి ఈ నీరు కూడా వచ్చి డ్యాంకు చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం జూరాలకు ఇన్ ఫ్లో 5,959 క్యూసెక్కులు ఉండగా ఔట్ ఫ్లో:1,711 క్యూసెక్కులుగా ఉంది. జూరాల పూర్తి స్థాయి నీట్టి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుత 8.377 టీఎంసీల నీటి నిల్వ ఉంది. 318.516 మీ పూర్తి స్థాయి మట్టంకు ప్రస్తుతం 317.880 మీటర్ల నీటి మట్టం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

Advertisement

Next Story