పడవ కొనాలనుకుంటున్న.. బ్రహ్మాజీ ట్వీట్

by Shyam |   ( Updated:2020-10-19 06:03:09.0  )
పడవ కొనాలనుకుంటున్న.. బ్రహ్మాజీ ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో వారంరోజులుగా కురుస్తున్న భారీ వర్షంతో వందల కాలనీల్లోకి వరద నీరు చేరగా ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కొన్నిచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. మరికొన్ని చోట్ల చెరువుల కట్టలు తెగి ఇళ్లలోకి నీరు చేరాయి. ఇదేక్రమంలో సినిమా వాళ్లు నివసించే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ఏరియాల్లో సైతం వరద నీరు బెంబేలెత్తిస్తోంది. తాజాగా సినీ నటుడు బ్రహ్మాజీ ఇంట్లోకి వరద నీరు చేరడంతో ఎటూ వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ట్విట్టర్‌లో స్పందించిన బ్రహ్మాజీ.. ఓ మోటార్ బోట్ కొనాలి అనుకుంటున్నాను.. దయచేసి ఏది బాగుంటుందో చెప్పండి అని రిక్వెస్ట్ చేశాడు. తన ఇంట్లోకి వచ్చిన నీరుతో పాటు చుట్టు పక్కల వరద ఫోటోలను పోస్టు చేశాడు. దీంతో ఆయన అభిమానులు వరదపై సెటైర్ వేస్తూ ట్వీట్లు చేస్తున్నారు.

Advertisement

Next Story