- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
3 బిలియన్ డాలర్ల పెట్టుబడుల ప్రయత్నంలో ఫ్లిప్‌కార్ట్
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ 3 బిలియన్ డాలర్లు(రూ. 22 వేల కోట్ల) పెట్టుబడులను సమీకరించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఈ నిధుల కోసం సాఫ్ట్‌బ్యాంకుతో పాటు ఇతర పెట్టుబడిదారులతో చర్చలు జరుపుతున్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఫ్లిప్‌కార్ట్ సంస్థ 40 బిలియన్ డాలర్లు(దాదాపు రూ. 3 లక్షల కోట్ల) మార్కెట్ విలువ లక్ష్యంగా ఉంది. ప్రస్తుతం ఇది 25 బిలియన్ డాలర్లు ఉండొచ్చని అంచనా. ఇందులో భాగంగా పెట్టుబడుల కోసం అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ, సింగపూర్‌కు చెందిన జీఈసీ, మరో పెట్టుబడి సంస్థతో చర్చలు కొనసాగిస్తున్నట్టు సమాచారం.
తాజాగా, సాఫ్ట్‌బ్యాంక్ తన విజన్ ఫండ్ 2 ద్వారా రూ. 2,000-రూ. 3,500 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాదిలో ఫ్లిప్‌కార్ట్ సంస్థ ఐపీఓకు వెళ్లనుంది. అంతకుముందే అదనంగా కొంతమేర నిధులను సేకరించేందుకు కంపెనీ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. కరోనా కారణంగా ఈ-కామర్స్ రంగంలో డిమాండ్ భారీగా ఊపందుకున్న నేపథ్యంలో ఫ్లిప్‌కార్ట్ నిధుల సమీకరణ జరుపుతోంది. ఇటీవల పెరుగుతున్న పోటీని తట్టుకునేందుకు ఫ్లిప్‌కార్ట్ కార్యకలాపాలను మరింత విస్తృతం చేస్తున్నట్టు పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి.