- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘డిజిటల్ మౌలిక వసతుల్లో పెట్టుబడులు అవసరం’
దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్ వ్యాప్తితో దాదాపు అన్ని విభాగాల్లో అనేక మార్పులు జరిగాయి. ఈ క్రమంలోనే వైఫై హాట్‌స్పాట్లు (WiFi hotspots), ఇన్‌బిల్డ్ సొల్యూషన్ (Inbuilt solution), ఫిక్స్‌డ్ బ్రాడ్‌బ్యాండ్ (Fixed Broadband), ఫైబర్ టూ హోమ్ (Fiber to home) లాంటి డిజిటల్ మౌలిక వసతుల్లో (Digital infrastructure) భారీగా పెట్టుబడులను పెట్టడం వల్ల డిజిటల్ సాంకేతికతను సాధించవచ్చని, తద్వారా పూర్తిస్థాయిలో ప్రయోజనాలు ఉంటాయని టెలికాం అథారిటీ ట్రాయ్ ఛైర్మన్ ఆర్ ఎస్ శర్మ తెలిపారు.
5జీ (5G), బ్యాండ్ సర్వీసులు (band services), క్లౌడ్ సేవలు ( cloud services), డేటా సెంటర్ (data center), వీడియో కాన్ఫరెన్స్ (video conferencing) అప్లికేషన్లను అధికంగా వినియోగించుకునే వీలుందని శర్మ పేర్కొన్నారు. ఎటువంటి అప్లికేషన్‌ను అభివృద్ధి (Application development) చేసినప్పటికీ ప్రజల జీవితాలపై సానుకూల ప్రభావాన్ని చూపగలగాలి. ఉత్పాదకతను, ఉద్యోగాలను, నైపుణ్యాలను పెంచే విధంగా ఉండాలి. మొత్తంగా సాధారణ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే లక్ష్యంతో ఉండాలని బ్రాడ్‌బ్యాండ్ ఇండియా ఫోరమ్ (Broadband India Forum) ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో శర్మ వ్యాఖ్యానించారు.
సాంకేతికతర ఏ స్థాయి అధునాతనమైనప్పటికీ, అది సామాన్యులకు ఉపయోగం లేకపోతే వృథాగా మారుతుందన్నారు. డిజిటల్ సాంకేతికత (Digital technology) భారత డిజిటల్ బాటలో కీలకమైన పాత్రను పోషించనున్నట్టు శర్మ వెల్లడించారు. టెలికాం రంగం (Telecom sector) మౌలిక సదుపాయాలకు అనుగుణంగా బిల్డింగ్ చట్టాలను సవరించాలని చెప్పిన శర్మ, టెలికాం రంగం..విద్యుత్, నీటి పైపుల మాదిరిగానే అవసరమైన విభాగమన్నారు.